కూటమిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పార్టీకి డిప్యూటీ సీఎం గా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అయితే గతంలో కూడా పవన్ కళ్యాణ్ కి హోంశాఖ పదవి ఇస్తారని చాలామంది అనుకున్నారు.. కానీ పవన్ కళ్యాణ్ ఏరి కోరి మరి డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ ఇతరత్రా వాటిని తీసుకున్నారు.డెవలప్మెంట్ కోసం పలు రకాల శాఖలను ఎంచుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ పలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ తాను హోం మంత్రి అయితే పరిస్థితులు మరొక లాగా ఉంటాయంటూ హెచ్చరించారు. విమర్శలు చేసే వారిని ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా తానే హోంమంత్రిగా బాధ్యతలు తీసుకుంటాను అంటూ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు.


అయితే పవన్ కళ్యాణ్ అలా ఫైర్ అవ్వడానికి కారణం రాష్ట్రంలో జరుగుతున్న మహిళల పైన అత్యాచారాలే అన్నట్లుగా సమాచారం. ముఖ్యంగా హోంమంత్రి అనితను సైతం హెచ్చరిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న వాటిని రివ్యూ చేయాలని హెచ్చరించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా కీలకమని పోలీసులు ఈ విషయాన్ని మరిచిపోవద్దంటూ హెచ్చరించారు.. మా బంధువు అంటే మడతపెట్టి కొట్టండి ఆడపిల్లలను సైతం రేప్ చేసే వారికి కుల ప్రస్తావన ఎందుకు వస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు.


తాను అందరు బాగుండాలని కోరుకొనే వ్యక్తిని ఇది ప్రతీకారాలు తీర్చుకునే ప్రభుత్వం కాదంటూ హెచ్చరించారు. తాము అధికారంలో ఉన్నాము కాబట్టే సహనాన్ని పాటిస్తున్నామంటే తెలియజేశారు.. గత ఐదేళ్లలో 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైనప్పటికీ సీఎం ఏం మాట్లాడలేదు అంటూ డిప్యూటీ సీఎం ఫైర్ అయ్యారు. సీఎంనే చంపేస్తామంటూ బెదిరించిన వ్యక్తిని పోలీసులు ఎందుకు వదిలేసారని మరొకసారి ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ఇళ్లలోకి వెళ్లి అత్యాచారాలు చేస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారంటే వారిని నిలదీయడం జరిగింది. మొత్తానికి మహిళలపై జరుగుతున్న అత్యాచారాల ఘటన పైన ప్రశ్నించినందుకు పవన్ కళ్యాణ్ ఘాటుగానే స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: