ఈ యాడ్ లో ఏముందంటే.. అమెరికా జెండా ముద్రించి ఉన్న టోపీలు ధరించిన ఒక జంట పోలింగ్ బూత్ కి వెళ్లి మరి ఓటు వేయడానికి వెళ్తారు.. అయితే ఈ టోపీలను ఎక్కువగా ట్రంప్ మద్దతు దారులు ధరిస్తూ ఉంటారట. అలా తన భార్య ట్రంప్ కే ఓటు వేస్తుందని భర్త భావిస్తూ ఉంటారని కానీ ఓటు వేసేందుకు వెళ్లినప్పుడు ఆమె మరొక మహిళ ఎదురుగా ఉన్నప్పుడు ఒకరినొకరు చూసుకొని వారు కమలహరిస్ కు ఓటు వేయడం అందులో చూపించారు.. ఈ వీడియోని నటి జూలియా రాబర్ట్స్ సపోర్టుగా షేర్ చేసినట్లు సమాచారం.
అలాంటిదే మరొక యాడ్లో తమ భార్యలు ట్రంప్ కే ఓటు వేస్తారని భర్తలు మాట్లాడుకుంటూ ఉండగా కానీ వారు మాత్రం కమలహారిస్ కి ఓటు వేసినట్లుగా చూపించారట. ఈ వీడియోల పైన ట్రంపు మద్దతుదారులు తీవ్రమైన ఆగ్రహాన్ని తెలియజేస్తున్నారట. ఇదంతా కేవలం మూర్ఖత్వం అంటూ విమర్శించారు.. భార్య స్థానం ఎవరికి ఓటు వేశారు అనే విషయం చెప్పకుండా ఉంటుందా అనే ప్రశ్న కూడా కొంతమంది వేస్తున్నారు.. ప్రస్తుతం సర్వేలన్నీ కూడా 93% మంది ఎక్కువగా ఈసారి అమెరికా అధ్యక్ష పదవి మహిళలకే ఉంటుందనే విధంగా చెప్పుకుంటున్నారట. అయితే ఓట్ల దగ్గరికి వచ్చేసరికి వివక్షాలు రాజ్యమేలుతున్నాయి అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా అటు మహిళా ఓటర్లను, పురుషుల ఓటర్లను ఆకర్షించేందుకు ఇద్దరూ కూడా పోటీ పడుతున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి.