ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి సర్కార్ అవినీతికి తావు లేని పాలనను అందించడం ద్వారా వార్తల్లో నిలుస్తోంది. అరబిందో సంస్థకు ఏపీ సర్కార్ భారీ షాక్ ఇవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అరబిందో సంస్థ అడ్డగోలుగా టెండర్లు దక్కించుకుందని 108, 104, 102 ఉద్యోగులకు ఈ సంస్థ నరకం చూపిస్తోందని కూటమి సర్కార్ చెబుతోంది.
 
ఈ మూడు పథకాలలో భాగంగా పని చేస్తున్న ఉద్యోగులకు గత రెండు, మూడు నెలలుగా సకాలంలో వేతనాలు అందడం లేదు. అయితే ఈ సేవల నుంచి అరబిందో సంస్థను తొలగిస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం, సేవల నిర్వహణ సరిగా లేకపోవడం, కనీసం వాహనాల మెయింటెనెన్స్ విషయంలో సైతం ఈ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సమాచారం.
 
ఈ ఆరోపణల నేపథ్యంలో ఆదేశాలు జారీ చేయడంతో పాటు కొత్తగా బాధ్యతలు అప్పగించడానికి టెండర్లు పిలవాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. గత కొన్నేళ్లుగా ఉద్యోగులకు వేర్వేరు అలవెన్స్ ల కింద చెల్లించాల్సిన 50 కోట్ల రూపాయలను సైతం సంస్థ చెల్లించలేదని తెలుస్తోంది. సంస్థ నిర్ణయాల వల్ల ఉద్యోగులు తీవ్రస్థాయిలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
 
102 ఉద్యోగులు ఇప్పటికే నిరసన తెలియజేస్తుండగా 108, 104 ఉద్యోగులూ తాజాగా ఆ సంస్థకు నిరసన నోటీసులను అంటించారు. అయితే ఈ సేవల నుంచి తాము తప్పుకుంటామని ఈ సంస్థ 40 రోజుల క్రితమే ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ సీఈవోకు లేఖ రాయడంతో పాటు జీవీ కంపెనీ, యునైటెడ్‌ బి హెల్త్‌కేర్‌ సంస్థలకు సబ్ కాంట్రాక్ట్ ను ఇవ్వాలంటూ లేఖలో పేర్కొంది. అరబిందో కాంట్రాక్టును రద్దు చేయాలని ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఏపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: