గడిచిన కొన్ని నెలల క్రితం కర్నూలులో జరిగిన ఒక కారు ప్రమాదం విషయంలో సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఆమె తెలియజేసింది. ఈ అసత్య ప్రచారణ తనకు మానసిక వేదనను కలిగిస్తోందంటూ వాటిని ఖండించకపోతే ప్రజలు నిజమనుకునే ప్రమాదం ఉందంటూ ప్రజలకు నిజం తెలియాల్సి ఉందని తెలిపింది. ఎప్పుడో జరిగిన ప్రమాదాన్ని తన కుమారుడు మీదికి ముడి పెట్టి ప్రచారం చేయడం చాలా బాధాకరం అంటూ విజయమ్మ తెలియజేసింది.. అయితే ఇదంతా కేవలం రాజకీయంగా లబ్ది పొందేందుకే దుర్మార్గపు పనులు పడుతున్నారు అంటూ తెలిపింది.
అంతేకాకుండా తన మనవళ్ల దగ్గరికి వెళ్లాల్సి ఉండగా జగన్కు భయపడే వెళ్లలేదని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలాంటివి చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదంటూ తెలిపింది విజయమ్మ. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ఆపితే మంచిదంటూ తెలిపింది.. ఇలాంటివి ఆపకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని చెబుతూ ఇలాంటివి ప్రచారాలు చేస్తే తాను అసలు సహించబోను అంటూ తెలియజేసింది విజయమ్మ. ఈ విషయాలన్నీ టిడిపి క్యాష్ చేసుకొని..ఇటీవలే టిడిపి పార్టీ సోషల్ మీడియాలో విజయమ్మ కారు ప్రమాదం గురించి ఒక పోస్ట్ చేస్తూ జగనే కుట్ర చేశారనే విధంగా ఒక ట్విట్ చేసింది. అంతేకాకుండా ఎన్నికల సమయంలో విజయమ్మ అమెరికాకు పోయి జగన్కు భయపడే వెళ్లిపోయారనే విధంగా టిడిపి దుష్ప్రచారం చేసింది. దీంతో ఇవన్నీ కూడా రూమర్స్ అని ఒక్క లేఖతో చెక్ పెట్టింది విజయమ్మ. ఈ విషయం వైసిపి అధినేత జగన్ కి కూడా కాస్త ఊరట అని చెప్పవచ్చు.