ఈ విషయం విన్న అటు టిడిపి కార్యకర్తలు సీనియర్ నేతలతో పాటు పలువురు నేతలు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.. రెడ్డి సత్యనారాయణ టీటీడీ బోర్డు మెంబర్గా కూడా పనిచేసినట్లు తెలుస్తోంది. మంత్రిగా కొనసాగుతున్నప్పుడు ఈయన ఎంతో హుందాగా తన జీవితాన్ని గడిపారని ఎక్కువగా ఈయన ఆర్టిసి బస్సులలోనే ప్రయాణించే వారిని సమాచారం. పింఛన్ డబ్బులతోనే అత్యంత సాధారణ జీవితాన్ని గడిపే వారట.. అత్యంత కీలకమైన పదవులలో ఉన్నప్పటికీ అవినీతికి ఆస్కారం ఉన్న ఆయన అలా చేయలేదట.
ఆయన ఎలాంటి అవినీతి మచ్చలేకుండానే రాజకీయాల నుంచి బయటికి వచ్చేసారట.. అయితే ఈయన ఐదు సార్లు గెలిచినప్పటికీ కూడా ఆర్థికంగానే ఇబ్బందులను ఎదుర్కొనే వారట. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిస్తేనే కోట్లు సంపాదించే రోజుల్లో ఆయన ఎలాంటి అవినీతి చేయకుండా ఉన్నారంటే అది చాలా గొప్ప విషయమని చెప్పవచ్చు.. అయితే ఈయన జీవించిన అన్ని రోజులు ఈయన జీవితాన్ని చూస్తే చాలామంది ఆశ్చర్యపోవడమే కాకుండా మరికొంతమంది ఆవేదనకు కూడా కలిగించేలా ఉండేదట. నేటి రాజకీయాలలో ఇలాంటి నాయకులు చాలా అరుదు.. కానీ ఈయన గురించి తెలిసిన వారందరూ మాత్రం ఈయన లాంటి నాయకుడు మరెవరు రారనే విధంగా కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా ఇలాంటి సీనియర్ నేత మరణించడంతో తీవ్ర దిగ్బ్రాంతికి గురవుతున్నారు టిడిపి కార్యకర్తలు.