ట్రంప్ గెలవాలని ఆయన అభిమానులు పూజలు చేస్తూ ఉండగా, కమలహరిస్ గెలవాలని ఆమె అభిమానులు కూడా ఇక్కడ పోటీగా పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఉండే మహామండలేశ్వర స్వామి ఆధ్వర్యంలో ట్రంప్ గెలుపు కోసం పూజలు చేస్తూ త్యాగాలు చేస్తూ ఉన్నారట. డోనాల్డ్ ట్రంప్ భారతదేశానికి ఆప్తుడని హిందువులకు ఆయన చాలా మేలు చేశారని మండలేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేస్తున్న వారు తెలియజేస్తున్నారు. బంగ్లాదేశ్లో హిందువుల పైన జరిగిన వాటిని ట్రంప్ ఖండించారని తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ ఉన్నప్పుడే ప్రపంచమంతా అభివృద్ధిగా జరుగుతోందంటూ తెలుపుతున్నారు.
ఇక కమలహారిస్ పూర్వీకులు కూడా తమిళ ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఇమే పూర్వికుల గ్రామంలో ఆయా ఆలయాలలో ఆమెకు మద్దతుగా ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తున్నారట. తులసిందపురం ఆలయంలో కమలహరీష్ గెలుపు కోసం పలు రకాల పూజలు నిర్వహిస్తున్నారట. కమలహరిస్ ఊరిలోనే ఆమెకు చాలా ప్రత్యేక అనుబంధం ఉండడంతో ఆమె అమెరికా అధ్యక్షులుగా ఎన్నికలలో గెలవాలని ఊరంతా కోరుకుంటూ ఉన్నారు. గతంలో కూడా ఆమె రెండుసార్లు అక్కడికి వచ్చింది. అలాగే మదురై లాంటి నగరాలలో కూడా కమలహారిస్ విజయం కోసం ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ పలు రకాల ఫోటోలతో బ్యానర్లతో తెగ హల్చల్ చేస్తున్నారు. మరి ఏ మేరకు అగ్ర రాజ్యాన్ని ఏలేది ఎవరో చూడాలి మరి.