మంగళవారం యూఎస్ అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా యూఎస్ ఎలక్షన్లకు ముందు ముందు బెట్టింగ్ మార్కెట్లు చాలా మారిపోయాయి. అమెరికన్లు ఓటు వేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో కమలా హారిస్‌పై డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యం తగ్గింది. ఇటీవల, ట్రంప్, అతని మద్దతుదారులు సాధారణ పోల్స్ కంటే బెట్టింగ్ మార్కెట్ అంచనాలు చాలా కచ్చితమైనవని చెప్పారు. వారాలపాటు, ఈ మార్కెట్లు అతన్ని హారిస్ కంటే చాలా ముందంజలో ఉన్నట్లు చూపించాయి.

అయితే ఎన్నికల రోజు సమీపిస్తున్న కొద్దీ ట్రంప్ గెలుపు అవకాశాలు పడిపోయాయి. ఈ వారాంతంలో, హారిస్ ఒక బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లో కూడా ముందున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా బెట్టింగ్ మార్కెట్లు బాగా పాపులర్ పొందాయి. పాలీమార్కెట్, కల్షి వంటి యాప్‌లు చాలా యాక్టివిటీని చూసాయి. పోల్స్ అధ్యక్ష పదవికి చాలా దగ్గరి రేసును చూపించగా, బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లు వారాల క్రితం ట్రంప్‌ను బలమైన స్థితిలో ఉంచాయి. ఇప్పుడు, పాలీమార్కెట్ ట్రంప్ గెలిచే అవకాశాలు 58% వద్ద ఉన్నాయని చెప్పింది. గత వారం 67% గెలిచే ఛాన్స్ ఉన్నట్లు ఇదే మార్కెట్ తెలియపరిచింది. ఇక కల్షి అతని ఛాన్స్ 65% నుంచి 53% వద్ద తగ్గిపోయినట్లుగా వెల్లడించింది.

మరో ప్లాట్‌ఫామ్, ప్రిడిక్ట్‌ఇట్‌లో, దాదాపు ఒక నెలలో మొదటిసారి ట్రంప్ కంటే హారిస్ గెలిచే అవకాశం ఉంది.  ప్రిడిక్ట్‌ఇట్‌ హారిస్‌కు 53%, ట్రంప్‌కు 51% గెలిచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఈ మార్కెట్‌లలో, ప్రజలు ఎవరు అధ్యక్షుడవుతారు వంటి భవిష్యత్ ఈవెంట్‌లపై పందెం వేస్తారు. మీరు ట్రంప్‌పై పందెం వేసి, అతను గెలిస్తే, మీరు పందెం వేసిన ప్రతి 58 సెంట్లకి 1 డాలర్ పొందుతారు.  హారిస్‌పై పందెం వేసి ఆమె గెలిస్తే, మీరు పందెం వేసిన ప్రతి 43 సెంట్‌లకు $1 పొందుతారు. అయోవాలో ట్రంప్ కంటే హారిస్ ముందున్నట్లు చూపించిన ఆశ్చర్యకరమైన పోల్ ఎన్నికల తరువాత చాలా మందిని షాక్‌కు గురి చేసింది. నిపుణులు తమ పందెం వేసేటప్పుడు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. సర్వేల ఫలితాలతో సహా!

మరింత సమాచారం తెలుసుకోండి: