ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి వైసీపీకి వరుస షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కుప్పంలో వైసీపీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. వైసీపీ కుప్పం మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ వారివారి పదవులకు రాజీనామా చేయడం జరిగింది. ఆ పార్టీ మున్సిపల్ ఛైర్మన్ గా పని చేస్తున్న డాక్టర్ సుధీర్ పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీకి రాజీనామా చేయడంతో పాటు మున్సిపల్ ఛైర్మన్ పదవికి, కౌన్సిలర్ పదవులకు సైతం ఆయన రాజీనామా చేశారు.
 
ఛైర్మన్ పదవికి సంబంధించిన రాజీనామా లేఖను ఆయన మున్సిపల్ కమిషనర్ దగ్గరకు పంపారు. ఆ తర్వాత సుధీర్ అమరావతికి వెళ్లి సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. చంద్రబాబు నాయుడు పసుపు కండువా వేసి సుధీర్ ను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆయన రాజీనామాతో పార్టీకి ఇబ్బందులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ తప్పులే కూటమికి శ్రీరామరక్ష అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
జగన్ పార్టీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం పార్టీ పతనానికి కారణమవుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కూటమిపై ప్రజల్లో వ్యతిరేకత భారీ స్థాయిలో పెరిగితే తప్ప ఈ పరిస్థితి మారే అవకాశం అయితే ఉండదు. జగన్ ఈ కామెంట్ల విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకొనిరావడంలో వైసీపీ మాత్రం ఫెయిల్ అవుతోంది.
 
రాబోయే రోజుల్లో మరి కొందరు కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. జగన్ కు సొంత కుటుంబ సభ్యులే వ్యతిరేకంగా మారడంతో పార్టీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. జగన్ భవిష్యత్తు ప్రణాళికలు, వ్యూహాలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. జగన్ పై ఇతర పార్టీల నేతల నుంచి విమర్శలు పెరుగుతున్నాయి. చంద్రబాబు ఇచ్చిన హామీలను నెమ్మదిగా ఒక్కొక్కటిగా అమలు చేస్తుండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: