- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . .

వైసీపీ అధినేత తీరు న‌చ్చ‌క‌ చాలామంది పార్టీ మారిపోతున్నారు అంటూ గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలకు లీకులు వస్తున్నాయి. ఆ లీకులు కూడా వైసీపీ క్యాంప్ నుంచే వస్తున్నాయి. మాజీ మంత్రులు కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అనిల్ కుమార్ యాదవ్ - జోగి రమేష్ తో పాటు మరో మాజీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరితతో పాటు మొత్తంగా ఆరుగురు మాజీ మంత్రులు వైసీపీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీలోకి వెళ్లిపోతారంటూ పుకార్లు వస్తున్నాయి. అయితే ఈ వార్తలు గత నాలుగైదు రోజుల నుంచి గట్టిగా వినిపిస్తున్న వీటికి బలం వచ్చేలా ఆ మంత్రులు ఎవరు వైసీపీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు. విచిత్రంగా జోగి రమేష్ తన కోరుకున్నట్టుగా మళ్లీ మైలవరం ఇన్చార్జిగా వచ్చారు. జోగి రమేష్ 2019లో పెడన నుంచి గెలిచి జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయారు .. మొన్న ఎన్నికల్లో ఇష్టం లేకపోయినా జగన్ బలవంతం చేయడంతో పెనమలూరు వచ్చి అక్కడ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు కోరుకున్నట్టు తన సొంత నియోజకవర్గ మైలవరం ఇంచార్జ్ పదవి ఇచ్చినా కూడా ఆ నియోజకవర్గ జోలికి వెళ్లడం లేదు.


రెడ్డి వర్గం నేత‌ల అహం కోసం తన రాజకీయ జీవితాన్ని జగన్ రెడ్డి బలి పెట్టాడని మరో మాజీ మంత్రి కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అనిల్ కుమార్ యాదవ్ వాపోతున్నారట. అయితే కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అనిల్ కుమార్ యాదవ్ కు వేరే చోట రాజకీయ భవిష్యత్తు లేకపోవడంతో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి భజన చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయనకు కూడా తత్వం బోధపడిందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కు పెద్ద వీరాభిమానిగా పేరు ఉన్న కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అనిల్ కుమార్ యాదవ్ జగన్ దగ్గర తన విధేయత నిరూపించుకోవటానికి చేయ‌ని కామెంట్లు లేవు .. చేయని విమర్శలు లేవు. నోరు అదుపులో ఉండని అనిల్ కుమార్ కూడా ఇప్పుడు తన భవిష్యత్తుకు పవన్ భరోసా ఇస్తారని ఆశిల్లో మునిగి తేలుతున్నారట. ఇక తన హోం మంత్రి పదవి పీకేయడంతో మేకతోటి సుచరిత జగన్ పై అలకబూనారు.


కానీ పార్టీ అధికారంలో ఉండడంతో కక్కలాట మింగలాట అలాగే కొనసాగారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షురాలుగా ఉన్న ఆమె పదవి కూడా పీకేశారు. మొన్న ఎన్నికల్లో ప్రతిపాడు ఎమ్మెల్యేగా ఉన్న ఆమెను బలవంతంగా ఓడిపోయే సీటు తాడికొండకు మార్చారు. అక్కడ మీ చిత్తుగా ఓడిపోయారు. తాడికొండలో పోటీ చేయటం సుచరితకు అస్సలు ఇష్టం లేదు. ఓవ‌రాల్ గా  మొత్తం ఆరుగురు మాజీ మంత్రులు జనసేన - టిడిపిలో చేరేందుకు రెడీ అవుతున్నట్టు వైసిపి నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రచారం బయటకు రావడంతో జగన్ తో పాటు పార్టీ కీలక నేత‌లలో కూడా టెన్షన్ మొదలైందని తెలుస్తోంది. ఇలాగైతే వైసీపీకి భవిష్యత్తు ఉంటుందా అని కూడా వారు టెన్షన్ పడుతున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: