గత కొంతకాలంగా కోలీవుడ్ హీరో సూర్య ఆయన భార్య జ్యోతిక విడిపోతున్నారనే విధంగా వార్తలు వినిపించాయి. ముఖ్యంగా ముంబైలో ఉండడంతో విడాకులు తీసుకున్నారని రూమర్స్ కూడా ఎక్కువగా వినిపించాయి. అయితే ఈ విషయం పైన అటు సూర్య కానీ జ్యోతిక కానీ ఎప్పుడు స్పందించలేదు. కానీ ఇటీవలే సూర్య కంగువ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. బాలయ్య అన్స్టాపబుల్ షో కి  గెస్ట్ గా వచ్చారు. అలాగే డైరెక్టర్ శివ కూడా ఈ షో కి రావడం జరిగింది.వీరితో పాటు నటుడు బాబి డియోల్ కూడా వచ్చారు.


అందుకు సంబంధించి ప్రోమో కూడా వైరల్ గా మారుతున్నది. సూర్య హీరోయిన్ జ్యోతిక ప్రేమించుకుని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే .. కోలీవుడ్లో బెస్ట్ కపుల్ గా పేరు పొందిన ఈ జంట ఒకరి గురించి ఒకరు ఎప్పుడూ కూడా చాలా గొప్పగానే చెబుతూ ఉంటారు .. ఇప్పుడు మరొకసారి సూర్య అన్ స్టాపబుల్ షోలో తన భార్య గురించి ప్రస్తావన రాగ జ్యోతిక లేకుంటే తన లైఫ్ అసలు ఊహించుకోలేను అంటూ ఐ లవ్ యు అంటూ చెప్పేశారు సూర్య.. దీంతో గత కొద్ది రోజులుగా వీరి మధ్య రూమర్స్ క్రియేట్ చేస్తున్న వారందరికీ కూడా రాడ్ దింపేయాల సమాధానం చెప్పారు అంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు.


ప్రస్తుతం ఈ ప్రోమో అయితే సూర్య అభిమానులను బాగానే ఆకట్టుకుంటోంది. కంగువ సినిమా సుమారుగా  32 భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈనెల 14వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. సరికొత్తగా ఈ సినిమాలో సూర్య కనిపించబోతున్నారు ఇందులో కూడా చాలామంది నటీనటులు కీలకమైన పాత్రలో నటిస్తున్నారట. మరి ఏ మేరకు ఈ సినిమా సూర్య కెరీయర్ని ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: