గత నెల రోజుల నుంచి వైఎస్ కుటుంబంలో జగన్, షర్మిల ఆస్తుల వివాదం రోజురోజుకీ పెద్దదిగా చేస్తున్నారు టిడిపి నేతలు.. కొంతమంది షర్మిలకు సపోర్టుగా చేస్తూ ఉండడంతో ఈ విషయం మరింత రాజకీయంగా ముదురుతోంది. అంతేకాకుండా వైయస్ కుటుంబాన్ని చీల్చే విధంగా కూడా పక్క ప్రణాళికలతోనే అడుగులు వేస్తున్నాయి పలు రాజకీయ పార్టీలు. ఇందులో భాగంగానే వైయస్ విజయమ్మ హత్యకు కుట్ర వంటి అంశాలను సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తూ ఉన్నాయి కొన్ని సోషల్ మీడియా సంస్థలు.


ఈ విషయం పైన తాజాగా సోషల్ మీడియా వేదికలో విజయమ్మ ఒక వీడియోతో సహా ఇలాంటి కుట్ర దృశప్రచారాలకు సైతం పెట్టే విధంగా రిలీజ్ చేసింది. తనపై తన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హత్యా ప్రయత్నం చేశారంటూ సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తలను చూసి తనకు చాలా ఆందోళన వ్యక్తం అవుతుందని పాత వీడియో ఒకటి బయటకు తీసుకువచ్చి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయడం సరికాదని తెలియజేసింది విజయమ్మ. మా కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఉండవచ్చు కానీ అంతమాత్రాన తల్లికి కొడుకు కాకుండా పోతారా అంటూ విజయమ్మ ప్రశ్నించింది.



ఇటీ వలే రాసిన రెండు లేఖలు కూడా తనవేనని నకిలీ లేఖలు రాయాల్సిన అవసరం తమ కుటుంబానికి ఏమీ లేదని తన కుమారుడు జగన్ కు అలాంటి అవసరం లేదని కూడా తెలియజేసింది. ఇంకొకసారి ఇలాంటి దుష్ప్రచారాలు ఎవరైనా చేశారంటే కచ్చితంగా వారి మీద పరువు నష్ట దావవేస్తామంటూ హెచ్చరించింది విజయమ్మ.. రాజకీయాలు చేయాలి అంటే నా కొడుకుతోనే డైరెక్ట్ గా ఫైట్ చేయండి కానీ ఇలాంటి నీచమైన రాజకీయాలు చేయవద్దండి అంటూ హెచ్చరిస్తోంది. మొత్తానికి సోషల్ మీడియాలో ఇలాంటి దుష్ప్రచారాలు చేసే వారందరికీ కూడా గట్టి కౌంటర్ వేసింది విజయమ్మ. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: