అమెరికాలో ఎన్నికలు జరుగుతున్నప్పటికీ.. ఇప్పుడు ఇండియాలో కూడా ఎన్నికలు చాలామంది ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా అక్కడ కమలహరిస్, ట్రంప్ మధ్య హోరా హోరిగా ఎన్నికలు జరగబోతున్నాయని విధంగా వార్తలు వినిపించాయి. ఎట్టకేలకు నిన్నటి రోజున ఎన్నికలు పూర్తి అయినప్పటికీ ఈ రోజున అమెరికా అధ్యక్షుడు ఎన్నికలు ఓట్లను సైతం లెక్కింపు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో డోనాల్డ్ ట్రంప్ 101 స్థానాలతో ముందు వరసలో ఉన్నట్లుగా సమాచారం. కమలహారిస్  కాస్త వెనుకబడినట్లుగా సమాచారం.


ఇప్పటికే 10 రాష్ట్రాలలో ట్రంప్ విజయాన్ని అందుకున్నారు. ముందు నుంచి అందరూ అనుకున్నట్టుగానే ట్రంప్ కి అక్కడ విజయ సంకేతాలు ఎక్కువగా ఉన్నట్లు పలు రకాల సర్వేలు ఏజెన్సీలు సైతం తెలియజేశాయి. హోరా హోరీగా సాగుతున్నటువంటి ఈ అమెరికా అధ్యక్షుడు ఎన్నికల ఫలితాలు సైతం ఈరోజు వచ్చేస్తాయట .ఒకవైపు రాష్ట్రాలలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ..101 ఎలక్టోరల్ ఓట్లతో అత్యధికంగా ముందుకు కొనసాగుతున్నట్లు ట్రంప్ తెలుస్తోంది. అలాగే మరొక 8 రాష్ట్రాలలో కమలహరిస్ అత్యధిక స్థానాలలో సంపాదించుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈమె 71 ఎలక్టోరల్  ఓట్లను సైతం సంపాదించుకున్నదట.


చాలా కీలకమైన స్వింగ్ స్టేట్ లో కమలహరిస్  వెనకబడింది 2020 ఎన్నికలలో ఈ రాష్ట్రం డెమోక్రటన్లకు 16 ఎలక్టోరల్ ఓట్లను సైతం సంపాదించుకున్నదట. అయితే ఆ సమయంలో మాత్రం పెన్విలీనియాలో మాత్రం చాలా కీలకమైన ఫిట్స్ బర్గ్, ఫిలడెల్ఫిమాలో ఈమె ముందంజలో ఉండడంతో ఇప్పుడు ఫలితాల పైన చాలా ఉత్కంఠత నెలకొన్నట్లు తెలుస్తోంది. అలాగే అయోవాలోని స్టోరీ కౌంటి, ఎయిమ్స్ నగరాలలో ఓటింగ్ యంత్రాలు కాసేపు మొరాయించినట్లుగా సమాచారం. దీంతో అక్కడ అధికారులు సైతం ఒక్కసారిగా రంగంలోకి దిగి ఆ సమస్యను సైతం పరిష్కరించి ఇప్పుడు మరి ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు వెలుపడే విషయంలో ఎలాంటి జాప్యం జరిగేది లేదంటూ అక్కడ అధికారులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: