చివరకు మొన్న ఎన్నికల్లో రజిని చిలకలూరిపేటలో పోటీ చేస్తే చిత్తుచిత్తుగా ఓడిపోతుందని పలు నివేదికలు స్పష్టం చేశాయి. దీంతో జగన్ ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ మార్చారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఆమెపై తెలుగుదేశం నుంచి పోటీ చేసిన మరో బీసీ మహిళ గల్లా మాధవి ఏకంగా 53,000 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించి రజనీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. వైసీపీ ఓడుపోవడంతో పాటు.. తాను కూడా ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో రజనికి ఇబ్బందులు తప్పడం లేదు. ఆమె జనసేనలోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు అన్న ప్రచారం కూడా జరుగుతుంది.
ఇదిలా ఉంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రజనీకి అస్సలు పట్టుచిక్కలేదు. దీంతో ఆమె తిరిగి తన సొంత నియోజకవర్గమైన చిలకలూరిపేటకు వెళ్ళిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తనను తిరిగి చిలకలూరిపేట ఇన్చార్జిగా నియమించాలని జగన్ ను కోరుతుంటే.. చిలకలూరిపేట వైసీపీ క్యాడర్ మాత్రం రజనీ తమకు వద్దే వద్దు అని జగన్కు మొరపెట్టుకుంటున్న పరిస్థితి. ఏది ఏమైనా ఐదేళ్లలో రజిని ఎంత వెలుగు వెలిగారో.. ఇప్పుడు ఒక్క ఓటమితో అలా పాతాళానికి పడిపోయారు. చివరకు ఆమెను గెలిపించిన నియోజకవర్గ వైసిపి క్యాడర్ కూడా ఆమె మాకు వద్దు అంటున్న పరిస్థితి వచ్చేసింది.