పవన్.. హోం మంత్రి పని తీరును తప్పుపట్టటం అంటే.. అది ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారి పనితీరును తప్పు పట్టటమే అవుతుందని.. పవన్ ఏదైనా మాట్లాడాలి అనుకుంటే అది క్యాబినెట్ సమావేశంలో చెప్పాల్సి ఉందని.. ఇలా బహిర్గతంగా మాట్లాడటం సరికాదని మందకృష్ణ తెలిపారు. అలాగే పవన్ కళ్యాణ్ తీసుకున్న మూడు మంత్రి పదవిలో ఒకటి కూడా ఎస్సీ లకు కేటాయించలేదని.. పవన్ జనసేన కోసం మూడు రిజర్వేషన్ సీట్లు తీసుకుంటే.. ఒకటి కూడా మాదిగ సామాజిక వర్గానికి కేటాయించలేదని మందకృష్ణ విమర్శించారు.
తూర్పుగోదావరి జిల్లాలో తీసుకున్న రాజోలు, టి గన్నవరం రెండు సీట్లు మాల సామాజిక వర్గానికి కేటాయించారని. అలాగే మాదిగ ఎక్కువగా ఉన్న ఉమ్మడి కడప జిల్లాలోని రైల్వే కోడూరు నుంచి మాదిగలకు సీటు ఇవ్వాలని కోరినా ఇవ్వకుండా.. అది కూడా మాల సామాజిక వర్గానికి చెందిన నేతకే కేటాయించారని పవన్ కళ్యాణ్.. మాదిగలకు తీవ్ర అన్యాయం చేశారని మందకృష్ణ మాదిగ మండిపడ్డారు. ఏది ఏమైనా మందకృష్ణ చేసిన ఈ కామెంట్లకు పవన్ దగ్గర ఆన్సర్ లేదని చెప్పాలి.