- మంత్రి ప‌ద‌వి లేక అల్లాడుతోన్న టీడీపీ క‌మ్మ సీనియ‌ర్లు

- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . .

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం లో తెలుగుదేశం పార్టీ కి రోల్ పోషిస్తుంది. తెలుగుదేశం పార్టీ .. అందులోను ఉమ్మడి గుంటూరు జిల్లా అంటే కమ్మ నేతల హవా ఎక్కువగా కనిపిస్తోంది. గుంటూరు జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ ఏకంగా 10 మంది కి పైగా కమ్మ‌ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. కీలకమైన గుంటూరు, నరసరావుపేట రెండు పార్లమెంటు స్థానాల నుంచి ఎంపీలు గా కొనసాగుతున్న పెమ్మసాని చంద్రశేఖర్, లావు శ్రీకృష్ణదేవరాయలకు ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు కావడం విశేషం.


అలాగే చిలకలూరిపేట, వినుకొండ, గురజాల, పెదకూరపాడు, మంగళగిరి, పొన్నూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా ఇదే కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కావడం విశేషం. ఈసారి పార్టీ అధికారంలోకి వస్తే తమకు కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని జీవి ఆంజనేయులు, య‌రపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ళ‌ నరేంద్ర కుమార్ లాంటి నేతలు బాగా ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి ఆశలు అడియాసలు అయ్యాయి.


ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి అయ్యారు. ఇక మంగళగిరి నుంచి గెలిచిన నారా లోకేష్ కూడా మంత్రి కావడంతో జిల్లాలో మిగిలిన కమ్మ సీనియర్ నేతలకు మంత్రి పదవి దక్కలేదు. ఈసారి కచ్చితంగా మంత్రి అవుతాము అని ఎన్నో ఆశలు పెట్టుకున్న వీరందరికీ ఇప్పుడు పెద్ద షాక్ తగిలినట్టు అయింది. అధికారంలోకి వస్తే ఏదేదో చేయవచ్చు అని ఆశల పల్లకిలో ఊరేగిన ఈ నేతలు అందరూ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక పూర్తిగా సైలెంట్ కావడంతో పాటు.. తమ తమ నియోజకవర్గాలకు పరిమితమై పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: