- బీఆర్ ఎస్ అధికారం లో ఉన్న‌ప్పుడు రేగా కాంతారావు చ‌క్రం
- పార్టీ ఓట‌మితో అడ్ర‌స్ లేకుండా పోయిన వైనం

- ( ద‌క్షిణ తెలంగాణ - ఇండియా హెరాల్డ్ ) . .

తెలంగాణ‌లోని కొత్తగూడెం జిల్లాలోని పినపాక అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఒకప్పుడు తన చలాయించారు. 2009లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన కాంతారావు తక్కువ మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇక 2014లో పినపాక సీటును పొత్తులో భాగంగా సిపిఐ దక్కించుకుంది. ఇక 2019 ఎన్నికలలో కాంగ్రెస్ పెద్దల దగ్గర బతిమిలాడి ఎలాగోలా సీటు దక్కించుకున్న కాంతారావు.. అప్పట్లో తెలుగుదేశం, కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం ఆయన బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలోకి జంప్ చేశారు.


తనతో పాటు మరో అయిదారుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరటంలో రేగా కాంతారావు కీలకపాత్ర పోషించడంతో.. కెసిఆర్ కు అత్యంత నమ్మకస్తుడిగా మారారు. ఈ క్రమంలోని కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా కాంతారావు వ్యవహరించారు. అప్పట్లో అధికారంలో ఉండడంతో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి.. ప్రస్తుతం మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గాన్ని ముప్పుతెప్పులు పెడుతూ మూడు చెరువుల నీళ్లు తాగించారని.. పొంగులేటి వర్గంపై లేనిపోని కేసులు కూడా బనాయించేలా చేశారన్న విమర్శలు మూట కట్టుకున్నారు.


అలాంటి కాంతారావు ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు నాలుగేళ్లపాటు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా.. అటు పినపాక ఎమ్మెల్యేగా చక్రం తిప్పన రేగా కాంతారావు ఇప్పుడు ఇల్లు దాటి బయటికి రాని పరిస్థితి. అసలు కాంతారావుని ఎవరు పట్టించుకోవడం లేదంట. అధికారంలో ఉన్నప్పుడు అధికారం అండ చూసుకొని ఓవరాక్షన్ చేసిన కాంతారావుకు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి అన్న గుసగుసలు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ వర్గాలలో వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: