కేంద్ర ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం శరవేగంగా ఏర్పాట్లు చేసుకుంటుంది. మోడీ రెండోసారి ప్రధానమంత్రి అయినప్పటి నుంచే వన్ నేషన్ ... వన్ ఎలక్షన్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే రాజ్యాంగ సవరణలు తప్ప మిగిలిన ప్రక్రియ అంతా పూర్తయిపోయింది. పార్లమెంట్లో బిల్లు పెట్టి సభల్లో వాటికి కావాల్సిన రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంది. ఎన్ని రాజ్యాంగ సవరణలు చేయాలి ?ఇందుకోసం ఈ నెలలోనే రాజ్యాంగ సవరణ కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఉభయసభల సంయుక్త సమావేశాలను ఇందుకోసమే ఏర్పాట్లు చేసినట్టుగా తెలుస్తోంది. అసలు ఈ వన్ నేషన్ ... వన్ ఎలక్షన్ పై కేంద్రం వ్యూహం ఏంటి అన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.


ముఖ్యంగా వన్ నేషన్ ... వన్ ఎలక్షన్ నిర్వహించాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ కాలపరిమితి పెంచాలి ... మరి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిధిని తగ్గించాలి అలా చేయడానికే ఆయా రాష్ట్రాలు కూడా అంగీకరించాల్సి ఉంటుంది. రాజ్యాంగ సవరణ కూడా ప్రత్యేకంగా చేయాల్సి ఉంటుంది. ఇలా మొత్తం 18 అంశాలపై రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని నిపుణుల అంచనా. ఇందుకోసం మూడు ఇంత‌ల రెండు వంతుల‌ మెజార్టీ అవసరంలో ఎన్డీయే కు అంత మెజార్టీ లేదు .. కానీ ఉభయ సభల సంయుక్త‌ సమావేశం ఏర్పాటు చేస్తే మద్దతు ఇచ్చే వారితో కలుపుకుంటే అవసరమైన మెజార్టీ వస్తుందని ఎన్డీఏ లెక్కలు వేసుకుంటున్నట్టుగా చెబుతోంది.


అందుకే 20వ తేదీ నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సంయుక్త సమావేశాలలో రాజ్యాంగ సవరణలు ప్రతిపాదించి ఆమోదించుకొని ఒకే దేశం ... ఒకే ఎన్నిక వచ్చే ఎన్నికల నుంచి చేపట్టేందుకు రెడీ అవుతున్నారు. అయితే ప్రతిపక్షాల నుంచి ఒకే దేశం ఒకే ఎన్నిక అన్నదాని పై తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం అన్న విమర్శలు వస్తున్నాం ... మోడీ ఎంత మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: