పిఠాపురంలో పర్యటిస్తే ఏపీలో లా ఆర్డర్ సరిగ్గా లేదంటూ తెలియజేశారు. అంతేకాకుండా జనాలు బయటికి వస్తే మమ్మల్ని తిడుతున్నారనే విధంగా మాట్లాడుతున్నారు.దీంతో అవి కాస్త వైరల్ కావడంతో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు నిజమా కాదా అనే చర్చ ఇప్పుడు కూటమి నేతలలో మొదలయ్యింది. అయితే ఇటీవలే మహిళల పైన జరుగుతున్న అరాచకాలు.. అలాగే ఉచిత ఇసుక అన్న పదం కేవలం మాటలకే పరిమితం అయ్యిందని.. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ప్రతి మహిళకు 1500 చొప్పున ప్రతినెల ఇస్తానని చెప్పిన కూటమి ప్రభుత్వం ఇవ్వకపోవడమే కాకుండా సామాన్యులు కూడా లేని ధరలతో అన్నీ కూడా భారీగా పెరిగిపోయాయి. ఇచ్చిన హామీలు చేయకుండానే గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సమయాన్ని గడిపేస్తున్నారనే విధంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారట.దీన్నిబట్టి చూస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పైన ప్రజలలో కాస్త వ్యతిరేకత మొదలయ్యిందా అని అనుమానాలు కూడా కూటమినేతలకు మొదలవుతున్నాయట.
ఇలా ఇవే కాకుండా చాలానే పనులు చేయకపోవడంతో ప్రజలు కోపంగా ఉండటమే కాకుండా చాలామంది కూటమిలో అటు టిడిపి, జనసేన పార్టీ నేతలు పదవుల కోసం చిన్న చిన్న వాటి కోసం కొట్లాడుతూ ఉండడంతో ఈ విషయం నచ్చక ఆవేశంతో పవన్ కళ్యాణ్ ఈ మాటలు అన్నారేమో అనే చర్చ కూడా ఇప్పుడు వినిపిస్తోంది. పవన్ సార్ బాధ్యత కలిగిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పటికీ ఇలాంటి మాటలు మాట్లాడడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతేకాకుండా హోంమినిస్టర్ గా ఉన్న బడుగు వర్గానికి చెందిన మహిళ మంత్రిని ఇలా అనడంతో ఇప్పుడు ఈ విషయం కూడా చర్చనీయాంశంగా మారింది.. ఆమె ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయినప్పటికీ కూడా కష్టపడి ఎదిగింది.