ఏపీలోని చాలా జిల్లాలలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన నాయకులు భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. భూ ఆక్రమణల వలా చాలా సందర్భాల్లో సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు తీవ్రస్థాయిలో నష్టపోతున్నారు. అయితే భూ ఆక్రమణదారులకు భారీ షాకిచ్చెలా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ, పట్టా భూముల ఆక్రమణలకు పాల్పడిన వారికి తగిన గుణపాఠం చెప్పేలా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
 
వారికి కఠిన శిక్షలు విధించడంతో పాటు భారీ జరిమానాతో చెక్ పెట్టేలా రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఉన్న చట్టాన్ని రద్దు చేసి ఆ చట్టం స్థానంలో కొత్త బిల్లుకు మంత్రి మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ చట్టం ప్రకారం ఇకపై భూ ఆక్రమణలకు పాల్పడే వాళ్లకు గరిష్టంగా 14 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం అయితే ఉంటుంది.
 
మంత్రి వర్గం ఏపీ డ్రోన్ పాలసీ, డేటా సెంటర్ల పాలసీ, సెమీ కండక్టర్ల పాలసీల అమలుకు మంత్రి వర్గం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని భోగట్టా. సీఆర్డీఏ పరిధి పెంపునకు సైతం ఆమోదం లభించడం గమనార్హం. బాబు ఆధ్వర్యంలో బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. ఏపీ సర్కార్ ప్రత్యేక కోర్టు ఏర్పాటు ద్వారా నిర్ణీత కాలంలో కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోనుంది.
 
ఏపీ డ్రోన్ పాలసీకి సైతం ఆమోదం లభించింది. ప్రస్తుతం సెల్ ఫోన్ల తయారీలో ఏపీ దేశంలోనే తొలి స్థానంలో ఉండటం గమనార్హం. ఫీజు రీయింబర్స్ మెంట్ మొత్తం ఇకపై కాలేజ్ యాజమాన్యాల అకౌంట్ లో జమ కానుంది. సీఆర్డీఏ పరిధిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ సర్కార్ ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా తీసుకుంటున్న నిర్ణయాలపై  ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: