కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయం ఎక్కువమంది ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ కు మోదీ సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ స్కీమ్ ద్వారా 860 విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఏడున్నర లక్షల రూపాయల రుణాన్ని మంజూరు చేయనున్నారని భోగట్టా.
 
ఈ రుణంలో 75 శాతం రుణంకు మోదీ సర్కార్ గ్యారంటీ ఇవ్వనుండటంతో విద్యార్థులకు సులువుగానే రుణాలు లభించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. 22 లక్షల మందికి పైగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది. ఈ స్కీమ్ కోసం 3,600 కోట్ల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఎలాంటి ష్యూరిటీ లేకుండా ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
 
కుటుంబ వార్షికాదాయం 8 లక్షల రూపాయల కంటే తక్కువగా ఉన్నవారు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. మధ్య తరగతి యువతకు విద్యాలక్ష్మితో అవకాశాలు పెరుగుతాయని చెప్పవచ్చు. 10 లక్షల వరకు రుణం తీసుకున్న విద్యార్థులకు 3 శాతం వడ్డీ రాయితీ లభించనుందని తెలుస్తోంది. పీఎం-విద్యాలక్ష్మి పోర్టల్‌ ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
 
మోదీ సర్కార్ విద్యకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ లను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే ఆ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మోదీ సర్కార్ పాలనపై, నిర్ణయాలపై విద్యార్థుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విమర్శలకు తావివ్వని పథకాలకు ప్రాధాన్యత ఇస్తోంది. అర్హులు మాత్రమే పథకాలు పొందే విధంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండటం గమనార్హం.




మరింత సమాచారం తెలుసుకోండి: