అగ్రరాజ్యం అమెరికాకు తదుపరి అధ్యక్షుడు ఎవరు ? అవుతారని ప్రపంచ దేశాలు అన్ని ఎంతో ఆసక్తితో ఎదురు చూశాయి. ఏ దేశ అధ్యక్ష ఎన్నిక‌కు ఇంత ఆసక్తి ఉండదు అంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటి దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైన వారికి సదుపాయాలు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. సకల సౌకర్యాలతో కూడిన శ్వేత సౌధం, వేతనం, 24 గంటలు ఈగ వాలకుండా చూసుకునే భద్రత సిబ్బంది ఉంటారు. మరోసారి అమెరికాకు అధ్యక్షుడు కాబోతున్న ట్రంప్‌కు ఎలాంటి సదుపాయాలు అందబోతున్నాయో చూద్దాం. అమెరికా అధ్యక్షుడికి వార్షికంగా నాలుగు లక్షల డాలర్ల వేతనం అందించనుంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.3.3 కోట్లు అన్నమాట. ఈ మొత్తాన్ని అమెరికా కాంగ్రెస్ 2001 లోనే నిర్ణయించింది. అప్పటినుంచి ఈ మొత్తంలో ఎలాంటి మార్పు లేదు.


సింగపూర్ ప్రధాని అందుకునే పదహారు లక్షల డాలర్లలో.. ఇది నాలుగో వంతు మాత్రమే. అమెరికా అధ్యక్షుడుగా రిటైర్ అయ్యాక వార్షికంగా రెండు లక్షల డాలర్లు లభిస్తుంది. ఒక లక్ష డాలర్లు అలవెన్స్ రూపంలో లభిస్తుంది. అమెరికా అధ్యక్షుడికి వేతనంతో వ్యక్తిగత, అధికారిక ఖర్చులకోసం ఏటా వేతనంతో పాటు 50 వేల డాలర్ల పన్ను రహిత వేతనం అందుతుంది. ప్రయాణ ఖర్చులకోసం మరో లక్ష డాలర్లు, వినోదం కోసం మరో 19 డాలర్లు అందుతుంది. ఈ మొత్తాన్ని కలిపితే ఏటా అధ్యక్షుడికి లభించేది 5.69 లక్షల డాలర్ల పై మాటే. అధ్యక్షుడిగా శ్వేత సౌధంలోకి అడుగుపెట్టడానికి ముందు.. డెకరేట్ చేయటానికి మరో లక్షడాలర్లు కూడా చెల్లిస్తారు. అమెరికా అధ్యక్షుడు అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది వైట్ హౌస్. ఇది అధికారిక నివాసం. అందుకే అమెరికా అధ్యక్షుడిని శ్వేత సౌధానికి అధిపతి అని కూడా అంటారు.


ఆరు అంతస్తుల ఈ భవనాన్ని.. పద్దెనిమిది వందల సంవత్సరంలో నిర్మించారు. అయితే కాలక్ర‌మేణా దీనికి ఆధునిక హంగులు జోడించుకుంటూ వచ్చారు. 55వేల చదరపు అడుగులు కలిగిన ఈ భవంతుల్లో.. 132 గదులు, 35 బాత్రూంలు ఉన్నాయి. ఇందులోనే టెన్నిస్ కోర్టు, జాగింగ్ ట్రాక్, మూవీ థియేటర్, స్విమ్మింగ్ పూల్ వంటివి ఉన్నాయి. అధ్యక్షుడి విందుకోసం.. ప్రతిరోజు ఐదుగురు చెఫ్‌లు పని చేస్తూ ఉంటారు. శ్వేత సౌధం కాకుండా.. బ్లైయిర్ హౌస్ అనే అతిథి గృహం ఉంటుంది. ఇది శ్వేత సౌధం కంటే పెద్దగా.. 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 119 గదులు, 35 బాత్రములు, నాలుగు డైనింగ్ హాల్స్, జిమ్ తో ఉంటుంది. ఇది కాకుండా క్యాంప్ డేవిస్ అనే పర్వత విడిది కేంద్రం కూడా ఉంటుంది.


మేరీ ల్యాండ్ రాష్ట్రంలో 128 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఉంది. రూజ్‌వెల్ నుంచి ప్రతి అధ్యక్షుడు దీన్ని వినియోగిస్తారు. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించడానికి ఉన్న ప్రత్యేక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ విమానం. ఇందులో సకల సౌకర్యాలు ఉంటాయి. గాల్లో ఉండగానే ఇంధనాన్ని నింపుకునే సామర్థ్యం దీని సొంతం. ఓ విధంగా దీన్ని ఎగిరే శ్వేత సౌధంగా పిలుస్తారు. అధ్యక్షుడికి సేవలందించడానికి మెరైన్ వన్ పేరుతో హెలికాప్టర్ ఉంది. ఇది గంటకు 280 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇందులో ఉన్న మూడు ఇంజిన్లలో ఒకటి ఫెయిల్ అయిన.. ఎగర గలదు. ఒకేలాంటివి 5 హెలికాప్టర్‌లు ఉంటాయి. ఎందులో అధ్యక్షుడు ఉన్నాడో కూడా శత్రువులకు కూడా తెలియదు. ప్రపంచంలో అత్యంత భద్రమైన కారును అమెరికా అధ్యక్షుడు ప్రయాణానికి ఉపయోగిస్తారు. దీనిని బీస్ట్ గా పిలుస్తారు. అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లిన బీస్ట్ అక్కడ అడుగు పెట్టాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: