అమెరికా అధ్యక్ష ఎన్నికలలో గెలిచింది డోనాల్డ్ ట్రంప్. కానీ.. ఆ గెలుపు వెనక ఒకే ఒక్కడు ఉన్నాడు. ఆ ఒకే ఒక్కడు వల్ల.. ఈరోజు ట్రంప్ గెలుపు సులువు అయింది. ఆ గెలుపు వెనక ఉన్న ఆ ఒక్కడు ఎవరో కాదు.. ఇలా అమెరికా మీడియా మొత్తం డోనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకం ఆయనను.. జోకర్‌గా... డిక్టేటర్ గా భావిస్తూ ప్రచారం చేసిన ఒక మస్క్ మాత్రం తన ఎక్స్ ఖాతాను ట్రంప్ కోసం ఉపయోగించారు. అంతేనా వందల కోట్ల విరాళం ఇచ్చారు. మొత్తం ఎక్స్‌ను ఆయన కోసం వినియోగించారు. ఊరు..వాడా.. ట్రంప్ కోసం ప్రచారం చేశారు. ట్రంప్ కు మద్దతు ఇచ్చే వారి కోసం రోజుకు మిలియన్ డాలర్లు ఇస్తూ వచ్చారు.
చర్చలు పెట్టారు.
అందుకే ట్రంప్ కూడా తన విజయం వెనక ఎలన్ మాస్క్ కీలకపాత్ర పోషించారని తెలిపారు. తాను నిరాశలో కూరుకు పోయినప్పుడు ఎలాన్ మస్క్ ఎంతో అండగా నిలిచారని ట్రంప్ తెలిపారు. అమెరికా రాజకీయాల్లోకి కొత్త సూపర్ స్టార్ వచ్చారని.. ఆయనే ఎలాన్ మాస్క్ అన్నారు. ట్రంప్ కోసం మస్క్ చేసిన ప్రచారం ఎలా ఉండేదంటే.. చివరికి డెమొక్రటిక్‌లు కూడా ఆయనపై అక్రమంగా ఆరోపణలు చేశారు. తాము వస్తే బయటికి పంపేస్తామని వార్నింగ్ లు కూడా ఇచ్చారు.
వీటన్నింటిని ఇలా అస్సలు పట్టించుకోలేదు. తనదైన పద్ధతిలో తాను ట్రంప్ కోసం పని చేస్తూ వచ్చారు. ఎన్నికల ప్రచారం సమయంలోనే ట్రంప్ గెలిస్తే ఆయనను క్యాబినెట్లోకి తీసుకుంటారని ప్రకటించారు. ఇప్పుడు మంత్రి కావచ్చు.. తాను కూడా క్యాబినెట్లో చేరుతానని ఆయన తెలిపారు. అయితే పక్తు వ్యాపారవేత్త అయిన ఇలా మంత్రిగా చేరతారో లేదో తెలియదు కానీ.. స్పేస్ ఎక్స్ ద్వారా అంతరిక్షాన్ని అందుకునేందుకు ట్రంప్ నుంచి కావాల్సినంత సాయం అయితే పొందగలరు అన్న చర్చలు నడుస్తున్నాయి.