- ( ఉత్త‌రాంధ్ర - ఇండియా హెరాల్డ్ ) . .

టాలీవుడ్‌లో వెండితెరపై దేవుడిగా ఒక వెలుగు వెలిగారు సీనియర్ ఎన్టీఆర్. అక్కడి నుంచి రాజకీయ రంగంలో అడుగుపెట్టిన ఆయన తనదైన మార్క్ క్రియేట్ చేశారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన తొలి నెలలోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఎంతోమంది సామాన్యులకు టిక్కెట్ ఇచ్చి.. ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నారు. అంతా ప్రజా జీవితంలో కొన్ని విలువలు పాటిస్తూ ఆదర్శంగా నిలిచారు. ఆయన టిక్కెట్ ఇచ్చిన వారిలో ఇప్పటికీ.. ఎమ్మెల్యేలుగా ఉన్నవారిలో నర్సీపట్నం నుంచి ఉన్న మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఒకరు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించిన నాటికి రాజకీయాల్లో ఒక రకమైన అవినీతి అక్రమాలు మొదలయ్యాయి.


దానిని ప్రక్షాళన చేయడం కోసం ఆయన విద్యావంతులను, సేవా తత్పరత ఉన్న వారిని, మధ్యతరగతి వర్గాలను, విద్యావంతులను, యువకులను గుర్తించి సీట్లు ఇచ్చి రాజకీయంగా ప్రోత్సహించారు. ఆ తరంలో చూస్తే ఎక్కువ మంది ఉపాధ్యాయులు అన్నగారి పిలుపు అందుకుని రాజకీయాలకు వచ్చి ఎమ్మెల్యేలు, మంత్రులు అయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కీలక శాఖలు నిర్వహించిన చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు. అలాంటి వారిలో సత్యం మాస్టర్ ఒకరు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని మాడుగుల నియోజకవర్గం పెదగోగాడ గ్రామానికి చెందిన రెడ్డి సత్యనారాయణ మాస్టారుగా ఆయన సుపరిచితులు. ఆయనను ఎన్టీఆర్ ప్రోత్సహించారు.


తెలుగుదేశం లో సత్యం మాస్టర్ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. ఐదుసార్లు ఆయన ఎమ్మెల్యే అయ్యారు. పార్టీలోని కీలక పదవులు ఆయనకు వచ్చాయి. 99 ఏళ్ళ వయసులో ఆయన.. ఈనెల 5న మృతి చెందారు. ఆయన మృతితో ఒక తరం అంతరించింది. అన్నగారి తరంలో నుంచి ఒక మంచి నాయకుడు కనుమరుగు అయ్యాడని అంతా చర్చించుకుంటున్నారు. ఆయన మంత్రిగా పనిచేసిన చాలా నిరాడంబరంగా ఉండేవారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించేవారు. సైకిల్‌నే తన వాహనంగా చేసుకుని గ్రామాలు తిరిగి ప్రజల సమస్యలు పరిష్కరించేవారు.

మరింత సమాచారం తెలుసుకోండి: