విశాఖ మరియు శ్రీశైలం వాసులకు ఒక అద్భుతమైన శుభవార్త. అది ఎందుకు అనుకుంటున్నా రా ..? ఈ ప్రాంత వాసులు ఇకపై గంటన్నరలోనే ఎక్కువ దూరాన్ని ప్రయాణించే వెసులు బాటు వారికి కలగబోతుంది. అసలు ఏమిటి అనుకుంటున్నా రా ..? విజయవాడ మరియు శ్రీశైలం పట్టణాల మధ్య రోడ్డు మార్గం దాదాపు 270 కిలో మీటర్ల దూరం ఉంటుంది . ఇంత దూరం అంటే రోడ్డు మార్గం ద్వారా చాలా ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఇకపై మాత్రం ఈ దూరాన్ని కేవలం గంటన్నరలోనే చేరుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా ..? ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ సీ ప్లేన్ సిస్టంను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

దానితో ఈ రెండు పట్టణాల మధ్య ఉన్న దూరాన్ని కేవలం గంటన్నర సమయంలోనే చేరుకునేందుకు అన్ని సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి 14 నుండి 19 సీటింగ్ కెపాసిటీ ఉన్న రెండు సీ ప్లేన్లు అందుబాటులో ఉన్నట్లు , ట్రైన్ పూర్తి అయిన తర్వాత ఖర్చు , నిర్వహణ , ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ఎప్పటి నుండి ఈ సీ ప్లేన్ల ప్రయాణాన్ని ప్రారంభించాలి. ఎన్ని సర్వీసులను నడపాలి. టికెట్ ధర ఎంత వసూలు చేయాలి అనేదాని గురించి అధికారులు త్వరలోనే పక్కా సమాచారాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

తొలి దశలో కనుక విజయవాడ మరియు శ్రీశైలం సీ ప్లేన్ సర్వీసులు సక్సెస్ అయినట్లయితే ఆ తర్వాత హైదరాబాద్ , బెంగళూరు లాంటి తదితర నగరాల్లో ఈ సేవలను స్టార్ట్ చేసే ఆలోచనలు అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. సీ ప్లేన్ సర్వీసులు కనుక సక్సెస్ అయినట్లు అయితే రోడ్డు ద్వారా ప్రయాణించే దానిలో చాలా తక్కువ సమయం లోనే గమ్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: