ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన, వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన వాక్యాలు చేశారు. అసలు పవన్ కళ్యాణ్ మంత్రిగా ఎలా అయ్యారని, ఆయనకు కొంచమైనా తెలివి ఉందా లేదా అని పేర్కొన్నారు. తాడేపల్లి నివాసంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఇటీవల సరస్వతి సిమెంట్ కంపెనీ భూములను పరిశీలించి చేసిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.


సరస్వతి భూముల్లో ఎలాంటి అక్రమాలు జరగలేదని స్వయానా తహసిల్దార్ చెప్పాడని వెల్లడించారు. అధిక ధర చెల్లించి రైతుల వద్ద భూములను కొనుగోలు చేశారని స్పష్టం చేశారు. పర్యావరణ శాఖకు మంత్రిగా ఉండి వాస్తవాలు తెలుసుకోకుండా భూముల లీజు గురించి తప్పుగా మాట్లాడడం దౌర్భాగ్యకరమంటూ హేళన చేశారు. 2014లోనే కేంద్ర భూముల లీజును 50 సంవత్సరాలకు పెంచిందని గుర్తు చేశారు. సిమెంట్ ఫ్యాక్టరీకి నీళ్లు, కరెంటు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నాడు. సరస్వతి భూములపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేశాడు.


మాజీ మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏకపక్షంగా తమ వాళ్లపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులకు, అధికారులకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అన్యాయంగా, అధర్మంగా తమ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులు, నాయకులపై కేసులు పెడుతున్న అధికారులు.... ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదని గుర్తుంచుకోవాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్యాయంగా ప్రవర్తించిన అధికారులను సప్త సముద్రాల అవతల ఉన్న తీసుకొచ్చి చట్టం ముందు దోషులుగా నిలబెడతామని చెప్పారు.


ఈ సందర్భంగా ఆయన తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. తెలంగాణ నుంచి తీసుకొచ్చి తిరుపతి ఎస్పీగా నియమించాడన్నారు. ప్రభుత్వం పోగానే మళ్ళీ తెలంగాణకు వెళ్ళొచ్చని సుబ్బారాయుడు అనుకుంటున్నాడని, అవన్నీ కుదరవని జగన్ తేల్చి చెప్పేశారు. డీజీపీ ద్వారక తిరుమలరావు టీడీపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారని జగన్ విమర్శలు చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: