- ( ఉత్తరాంధ్ర - ఇండియా హెరాల్డ్ ) . .
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అటు పాలనాపరంగా ఎంత బిజీగా ఉన్నా.. ఇటు రాజకీయంగా, పార్టీ పరంగా ఎవరు ఏం ?చేస్తున్నారో అనేది ఎప్పటికప్పుడు గమనిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సరిగా పనిచేయని మంత్రుల కు సైతం వార్నింగ్ లు ఇస్తున్నట్టు గట్టిగా వార్తలు వస్తున్నాయి. మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు చంద్రబాబు గట్టిగా వార్నింగ్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది. అలాగే సరిగా పనిచేయని ఎవరిని కూడా చంద్రబాబు వదలటం లేదు. ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడుకు సైతం చంద్రబాబు స్మూత్ గా వార్నింగ్ ఇచ్చినట్టు.. చురక వేసినట్టు తెలుస్తోంది.
వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవాలు .. శంకుస్థాపన లు చేసిన ముఖ్యమంత్రి.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీకాకుళం, కృష్ణ, నంద్యాల జిల్లాల కలెక్టర్లు.. ఆ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. ఈ క్రమంలోనే ఇచ్చాపురం సబ్ స్టేషన్ ప్రారంభోత్సవంలో స్థానిక ఎంపీగా ఉన్న రామ్మోహన్ నాయుడు కనపడలేదు. వెంటనే చంద్రబాబు కలెక్టర్ గారు మీ మంత్రి ఎంపీకి సమాచారం ఇవ్వలేదా ? అని స్వప్నిల్ దినకరన్ ను ప్రశ్నించారు. వెంటనే ఆయన చంద్రబాబుకు సమాచారం ఇచ్చానని చెప్పారు.
ఎంత బిజీగా ఉన్నా ప్రజలకు దూరం కాకూడదు కదా.. వర్చువల్‌గా కూడా జాయిన్ కావచ్చు. మంత్రులైనా.. ఎంపీలే అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలతో ఎప్పటికప్పుడు మమేకం కావాలి. దీని నుంచి తప్పించుకోకూడదు అని కేంద్ర మంత్రిగా కూడా ఉన్న రామ్మోహన్ నాయుడుకి చురకలు వేశారు. వాస్తవానికి రామ్మోహన్ నాయుడు ఇలాంటి విషయాలలో ఎప్పుడు ముందు ఉంటారు. ఎంతో బిజీగా ఉంటే తప్ప ఆయన ప్రజలకు దూరంగా ఉండేందుకు ఎంత మాత్రం ఇష్టపడరు అన్న విషయం తెలిసిందే.