కోట్లాదిమంది భక్తుల దేవదేవుడు తిరుమల శ్రీవారు. ఆయన ఒక్క క్షణం దర్శనం కోసం వేల మైళ్ళ నుంచి భక్తులు వస్తూ ఉంటారు. వేల రూపాయలు హిందువులు ఖర్చుపెట్టుకుంటారు. అయితే ఆయనపై ఏ మాత్రం భక్తి లేనివారు.. ఇతర మతాలవారు కొండపై పనులు చేస్తుంటే చాలా ఇబ్బంది కరం. టిటిడి పూర్తిగా హిందువులకు సంబంధించిందే. అన్యమతస్తులు పనిచేయటం వారికి మంచిది కాదు. భక్తుల విశ్వాసానికి ఎంత మాత్రం మంచిది కాదు. కానీ.. గత ఐదేళ్లుగా జరిగిన ఘోరాలు మాత్రం ఎవ్వరు ఊహించనివి.
అందులో ఒకటి అన్యమత ఉద్యోగులు చేరిపోవటం. మతం మారిన వారు చాలామంది కొండపైకి చేరారు. ఇప్పుడు వారందరి నీ ప్రక్షాళన చేయాలని కొత్త ఛైర్మన్ నిర్ణయించారు. నిజానికి 2019 వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు సీఎస్ గా ఎల్వి సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆ సమయం లో తిరుమల లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఆయన ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి విచారణ చేశారు. అన్య మతస్తులు అని అనుమానం వచ్చిన టిటిడి ఉద్యోగులు ఇళ్లకు కూడా వెళ్లి పట్టుకున్నారు. ఇది జగన్ రెడ్డికి నచ్చలేదు.
ఆయన సీఎస్‌గా ఉన్న ఎల్వీ ని అవమానకరంగా బయటకు పంపేశారు. 2020లో అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు బంధం కలిగిస్తున్న వారిని గుర్తించి 69 మంది ఉద్యోగులు జాబితాను రెడీ చేశారు. కానీ.. ఇంకా చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు వారి సంఖ్య ఇంకా పెరిగింది. అందుకే తరచూ వివాదాస్పద అంశాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యమంత్రి ఆదేశాల తర్వాత టీటీడీలోని అన్యమత ఉద్యోగులందరికీ స్వచ్ఛందంగా బదిలీ ఆఫర్ ఇస్తారు. వినియోగించుకుంటే సరే .. లేకపోతే ఇంటికి పంపే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా తిరుమల కొండపై అక్రమంగా తిష్ట వేసిన అన్యమత ఉద్యోగులకు .. గడ్డుకాలం మొదలైందని చెప్పాలి.