ఇందుకు సంబంధించి ప్రస్తుతం పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ వ్యవస్థ ప్రక్షాళన దిశగా అడుగులు పడ్డాయి. అర్హత ఉన్నవాళ్లందరికీ ఏపీ సర్కార్ పోర్టిఫైడ్ బియ్యం అందిస్తోంది. ఐరన్ లోపం నివారణకు ఆస్కారం లేకుండా ఈ బియ్యం విషయంలో ఏపీ సర్కార్ జాగ్రత్తలు తీసుకుంటోంది.
అదే సమయంలో అత్యాధునిక కార్డుల మంజూరు దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ఏర్పాటు కానున్న రైస్ ఏటీఎంలకు అనుసంధానంగా ఈ కార్డులను తీర్చిదిద్దనున్నారని సమాచారం అందుతోంది. కొత్త జంటలకు వెంటనే కార్డులు ఇచ్చే దిశగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. ఆహార భద్రత చట్టం 2013 అమలు మేరకు కార్డులను అందించనున్నారు.
కొత్తగా పెళ్లైన వారికి అర్హులైన అందరికీ కొత్తగా కార్డులు ఇవ్వనున్నారని తెలుస్తోంది. తల్లీదండ్రుల నుంచి విడిపోయిన వారితో పాటు ఒంటరిగా ఉన్నవారికి సైతం కార్డులు దక్కనున్నాయని సమాచారం అందుతోంది. ఇప్పటికే యూపీ, ఒడిశా రాష్ట్రాలలో రైస్ ఏటీఎంలను మొదలుపెట్టారని అక్కడ లబ్ధిదారులకు ఊరటగా ఉందని తెలుస్తోంది. రైస్ ఏటీఎంల సహాయంతో నిమిషాల్లోనే సరుకులు తీసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. రైస్ ఏటీఎంల విషయంలో చంద్రబాబు విజన్ కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో మరిన్ని స్కీమ్స్ ను అమలు చేయడం ద్వారా ఏపీ ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చనున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.