కనీసం ప్రజలు ఒక పూట కూడా తినలేని దేశాలు చాలానే ఉన్నాయి. అలాంటి దేశాలలో ఆఫ్రికా దేశం దక్షిణ సూడాన్ ఒకటి. ఇది ప్రపంచంలోనే అత్యంత పేద దేశంగా ఉంది. ఇక్కడ 11 మిలియన్ల మంది పేదవారు నివాసం ఉంటున్నారు. దక్షిణ సూడాన్ రాజధాని జుబా. 2011లో స్వాతంత్రం పొందిన ఈ దేశం అనేక రకాలుగా ఆర్థికపరంగా సవాళ్లను ప్రతిరోజు ఎదుర్కొంటుంది. జిడిపి లెక్కల ప్రకారం ఇక్కడి ప్రజల వార్షిక ఆదాయం సుమారు 455.16 డాలర్లు అంటే 38,196 రూపాయలు మాత్రమే.
రెండవ పేద దేశంగా బురుండి ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ నివసించే ప్రజలు కనీస అవసరాలు అయిన నీరు, విద్యుత్, ఆహారం కోసం ప్రతి రోజు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. బురుండి ప్రజల వార్షిక ఆదాయం 915 డాలర్లు అని చెబుతున్నారు. అంటే ఇండియా లెక్క ప్రకారం 76,786 రూపాయలు మాత్రమే అన్న మాట. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ పేదరికంలో మూడవ స్థానంలో ఉంది.
ఇక్కడి ప్రజలు సంవత్సరానికి 1120 డాలర్లు అంటే 93,996 రూపాయలను మాత్రమే సంపాదిస్తున్నారు. ఇక్కడి దేశ జనాభా 55. సోమాలియా ప్రపంచంలోనే నాల్గవ పేద దేశంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ దేశంలో సైనిక దౌర్జన్యాలు, సముద్రపు దొంగల బీభత్సం, అస్థిరత ఉన్నాయి. ఈ దేశ జనాభా సుమారు ఒక కోటి 26 లక్షలు. కాంగో ప్రపంచంలోనే అయిదవ పేద దేశంగా నిలిచింది. ఇక్కడి ప్రజలు సంవత్సరానికి రూ. 1,30,099 రూపాయలు మాత్రమే సంపాదిస్తున్నారు. ఇంకా చాలా దేశాలు ఇప్పుడు ఇప్పుడే అభివృద్ధి చెందతున్నాయి.