సోషల్ మీడియా అకౌంట్లు ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ ఉన్నాయి. చాలామంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అయితే సోషల్ మీడియా పోస్టుల విషయంలో కొంతమంది హద్దులు దాటి విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ రెచ్చిపోతున్న వైసీపీ అనుకూల వ్యక్తులకు, ఇతరులకు షాకిచ్చే దిశగా అడుగులు పడుతున్నాయి.
 
ఏపీ సర్కార్ ఆదేశాల మేరకు ఇప్పటికే కడప పోలీసులు అప్రమత్తం కాగా ఉమ్మడి అనంతపురం జిల్లా పోలీసులు సైతం సోషల్ మీడియాను తప్పు మార్గంలో ఉపయోగిస్తున్న వాళ్లపై చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఫేక్ ఐడీలతో పోస్టులు పెట్టినా గుర్తించి పట్టుకునే విధంగా సాంకేతికతను వినియోగించడంతో పాటు ఇందుకోసం స్పెషల్ టీమ్ లను రంగంలోకి దింపడం గమనార్హం.
 
12 వందలకు పైగా సోషల్ మీడియా గ్రూపులపై పోలీసులు నిఘా ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఆరుగురు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, సానుభూతిపరులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారని సమాచారం అందుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని, కూటమి నేతలను, వారి కుటుంబసభ్యులను కించపరిస్తూ కామెంట్లు చేసే వాళ్ల విషయంలో పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు.
 
ఏపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో వైసీపీ మాత్రం ఒకింత సీరియస్ గా ఉంది. ఏపీ సర్కార్ రాబోయే రోజుల్లో ఏం చేయబోతుందో చూడాల్సి ఉంది. సోషల్ మీడియా విషయంలో కూటమి సర్కార్ కఠినంగా వ్యవహరించడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. ఏపీ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తూ ఉండటంతో వైసీపీకి అనుకూలంగా పని చేసిన వ్యక్తులు సైతం ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఏపీ సర్కార్ సరైన దారిలో అడుగులు వేస్తోందని సామాన్యులు సైతం కామెంట్లు చేస్తుండటం గమనార్హం.





మరింత సమాచారం తెలుసుకోండి: