తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. తన పుట్టినరోజునే... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దారుణమైన అవమానం జరిగింది. శనివారం రోజున తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే.
ఈ తరుణములోనే... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి... తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రపు నేతలు కూడా శుభాకాంక్షలు తెలిపారు.


చంద్రబాబు నాయుడు, గులాబీ పార్టీ నేతలు కేటీఆర్ అలాగే హరీష్ రావు, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లాంటి కీలక నేతలందరూ... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అటు పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చాలామంది... పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ అలాగే కేంద్ర మంత్రులు కూడా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలపడం మనం చూసాం.


 అయితే ఇంత జరుగుతున్నా... కాంగ్రెస్ పా ర్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం... దీనిపై ఎక్కడ స్పందించలేదు. అమెరికా లో గెలిచిన ట్రంప్, ఓడిన కమల హారిస్ లకు రాహుల్ గాంధీ లేఖ రాయడం జరిగింది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రం... పుట్టినరోజు శుభాకాంక్షలు ఎక్కడ తెలుపలేదు. సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెడితే సరిపోయేది. కానీ రాహుల్ గాంధీ ఆ పని చేయలేదు.

గత మూడు నెలలుగా... రేవంత్ రెడ్డి కి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదట. ఎప్పుడు కలవాలని చూసినా రాహుల్ గాంధీ ఎస్కేప్ అయ్యారట. అయితే గతంలో రాహుల్ గాంధీని లీడర్ చేసింది తానేనని రేవంత్ రెడ్డి జాతీయ మీడియాతో తెలిపారుట.  దీంతో రాహుల్ గాంధీ అలాగే రేవంత్ రెడ్డి మధ్య  సంబంధాలు చెడిపోయాయని అంటున్నారు. అంతేకాదు మహా రాష్ట్ర ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి ని దించేస్తారని కూడా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: