ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు హీట్ ఎక్కుతున్నాయి. పొద్దున లేస్తే చాలు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్ షర్మిల మధ్య వివాదాలు వినిపిస్తున్నాయి అలాగే కనిపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ షర్మిల ఆస్తుల వివాదాలు... నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి.  అన్యాయంగా తన తండ్రి ఇచ్చిన ఆస్తులను జగన్మోహన్ రెడ్డి లాగేసుకున్నాడని... వైయస్ షర్మిల ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రతిరోజు దుమ్మెత్తి పోస్తోంది.

 అయితే తానేమి తప్పు చేయలేదని కోర్టుల చుట్టూ జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి పైన కోపంతో... గత ఎన్నికల కంటే ముందు నుంచే... సొంత అన్నయ్యను టార్గెట్ చేసింది వైయస్ షర్మిల రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం కూడా షర్మిల చేయడం జరిగింది. ఈ తరుణంలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసిపి దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే.

 అయితే ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని... ఇప్పటికీ వదలడం లేదు వైయస్ షర్మిల. ఆస్తుల పేరుతో జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ...అసెంబ్లీ స మావేశాలకు వైసీపీ హాజరు కాబోదని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దీనిపై జగన్మోహన్ రెడ్డికి వైయస్ షర్మిల కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే... వెంటనే రాజీనామా చేయాలని జగన్మోహన్ రెడ్డికి చురకలు అంటించారు షర్మిల.


 అయితే వైయస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై... వైసిపి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. చంద్రబాబు నాయుడు గతంలోనే... ముఖ్యమంత్రి అయ్యేవరకు అసెంబ్లీలో అడుగు పెట్టనని బయటికి వెళ్లాడని వై సిపి గుర్తు చేస్తోంది.  మరి అప్పుడు చంద్రబాబు నాయుడును ఎందుకు ప్రశ్నించలేదు అని వైసిపి నిలదీస్తోంది. అప్పుడు చంద్రబాబు నాయుడుతో రాజీనామా ఎందుకు పెట్టించలేదని... ఆగ్రహిస్తోంది. దీంతో షర్మిల... గప్ చుప్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: