సోషల్ మీడియాలో వరుసగా వీడియోలు పెట్టి మరి... జగన్మోహన్ రెడ్డి పైన ఈగ కూడా వాలకుండా చూసుకుంది శ్రీరెడ్డి. అయితే అలాంటి శ్రీ రెడ్డికి.. ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ... చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని ఇకపైన తాను ఏమీ అనబోనని ప్రకటించింది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ఏపీ హోమ్ మినిస్టర్ అనిత లకు బహిరంగంగా క్షమాపణలు చెప్పింది శ్రీరెడ్డి.
ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా పోస్ట్ పెట్టింది. వీడియో రిలీజ్ చేసి... ఈ బడా నేతలకు క్షమాపణలు చెప్పింది నటి శ్రీరెడ్డి. ఇక పైన చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కుటుంబాల పైన... సోషల్ మీడియాలో ఎలాంటి తప్పుడు పోస్టులు పెట్టబోనని... తప్పుడు వ్యాఖ్యలు చేయనని పేర్కొంది. తన వల్ల మీ ఫ్యామిలీకి నష్టం... రాకూడదని ఆమె పేర్కొంది. ఇప్పటివరకు జరిగిన తప్పిదాలకు క్షమాపణలు చెబుతున్నట్లు నటి శ్రీరెడ్డి ప్రకటించింది.
ఇకపై తన పైన కేసులు, వైసీపీ కార్యకర్తలను హింసించడం లాంటివి చేయకూడదని... చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నటి శ్రీరెడ్డి కోరింది. మేము మీ జోలికి రాబోమని.. మీరు కూడా మమ్మల్ని వేధించకండి అంటూ స్పష్టం చేసింది నటి శ్రీరెడ్డి. ప్రస్తుతం శ్రీరెడ్డి విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొన్ని రోజులుగా కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి మరి.. వైసిపి నేతలను అలాగే కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే శ్రీ రెడ్డి పై కూడా కేసులు పెట్టింది కూటమి సర్కార్. అందుకే ఓ వీడియో ద్వారా క్షమాపణలు చెప్పింది శ్రీరెడ్డి.