గుంటూరు జిల్లాలోని తాడికొండ చిలకలూరిపేట నియోజకవర్గాలకు సైతం వైసీపీ కొత్త సమన్వయ కర్తలను సైతం నియమించారు.. తాడికొండలో మాజీ మంత్రి సుచరితను కాకుండా బాలవజ్రబాబును తీసుకువచ్చారు.. అలాగే చిలకలూరిపేటలో కావటి మనోహర్ నాయుడు స్థానంలో మళ్లీ మాజీ మంత్రి అయిన రజినీని తీసుకురావడం జరిగింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొంత మంది వైసీపీ నేతలు పార్టీని వీరడంతో కొన్ని నియోజకవర్గాలలో కొంత మంది సమన్వయకర్తలు సైతం అందుబాటులో లేకపోవడంతో ఉన్న నేతలని కొనసాగించేందుకు ఆసక్తి చూపించడంతో అధిష్టానం మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం.
గత కొద్ది నెలలు ఉమ్మడి గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట నియోజకవర్గానికి కావటి మనోహర్ నాయుడు ఉండగా ఇప్పుడు ఆయనను తప్పించి మాజీమంత్రి రజినీని అక్కడికి పంపించారు. ఇప్పుడు మళ్లీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆమెను తప్పించి చిలకలూరిపేటకు పంపించినట్లు తెలుస్తోంది. మరొకవైపు తాడికొండ నియోజకవర్గం లో గతంలో హోం శాఖ మంత్రిగా పనిచేసిన మంత్రి మేకతోటి సుచరిత.. కొనసాగలేనని చెప్పడంతో గుంటూరు నగర డిప్యూటీ మేయర్ బాలవజ్రబాబుని నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమించారట. మొత్తానికి వైసీపీ పార్టీ అధిష్టానం నియోజవర్గాలపైన ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మరి పార్టీ మార్పు పైన విడుదల రజిని క్లారిటీ వచ్చినట్లేనని చెప్పవచ్చు.