డిగ్రీ, ఇంజనీరింగ్ దశ అనేది ప్రతి విద్యార్థికి ఎంతో కీలకమైంది. ఆ దశలోనే ప్రపంచాన్ని శాసించే ఏఐ స్కిల్స్ ఉంటే ఆ విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవడం ఖాయమని రాం ప్రసాద్, రాజశేఖర్, శేషారెడ్డి తెలిపారు. ఏఐ నైపుణ్యాలతో విద్యార్థులను వివిధ పరిశ్రమలకు తగిన నైపుణ్యాలతో సిద్ధపరచడం.. వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఈ టూల్ సహాయ పడుతుందని వివరించడం జరిగింది. అలాగే తెలంగాణలోని పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టే విదేశీ పారిశ్రామికవేత్తలను ఆకర్షించడానికి అనువైన ఒక సాఫ్ట్‌వేర్ ప్లాట్ ఫారం కూడా రూపొందించడం జరిగిందని మహేష్‌గౌడ్‌కు వివరించారు.
ఇక తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణను దేశంలో వివిధ రంగాలలో అగ్రగామిగా ఉంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కృషి చేస్తుందని, విద్యార్థులకు ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తుందని, ఐటి, ఫార్మా రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ అత్యంత అనుకూలమైనదని వారికి తెలిపారు. ఈ కంపెనీ తయారు చేసిన రెండు సాధనాలు తెలంగాణా రాష్ట్రానికి ఎంత ఉపయోగకరమైనవని.. వీటిని మరింత డవలప్ చేసి మరోసారి తనను కలవాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా సీఈఓ రాజశేఖర్‌ను మహేష్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఏపీపీఎస్సీ మెంబర్ శ్రీ సీతారామరాజును కూడా వీరు కలిశారు.