- సీఎం చంద్రబాబు మంచి విజనరీ లీడర్ క్రిస్టోఫర్
- చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని వ్యాఖ్య
- న్యూజిలాండ్ ప్రధానినీ రాష్ట్ర పర్యటన రావాలని ఆహ్వానించిన ఎమ్మెల్యేలు
- ఏపీలో తయారైన కియా న్యూజిలాండ్లో కు ఎగుమతి
- ప్రధానితో ఎమ్మెల్యేలు ఏలూరి,నరేంద్రవర్మ


న్యూజిలాండ్ ప్రధాన మంత్రి  క్రిస్టోఫర్ లక్సన్ తో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, వేగేశన నరేంద్ర వర్మలు భేటీ అయ్యారు.మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్, న్యూజిలాండ్ ఎన్నారై టిడిపి ఆహ్వానం మేరకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యేలు గురువారం న్యూజిలాండ్ ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధానితో ఎమ్మెల్యేలు ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కీలక అంశాలను ప్రధానమంత్రికి వివరించారు. దీంతో ఆయన సీఎం చంద్రబాబు తనకు చాలా బాగా తెలుసునని, మంచి విజనరీ లీడర్ అని కితాభిచ్చారు. చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సారధ్యంలో నెలకొల్పిన కియా మోటార్స్ కార్లు ఆంధ్రప్రదేశ్ నుంచి న్యూజిలాండ్ కు వస్తున్నాయని ఎమ్మెల్యే ఏలూరి,నరేంద్ర వర్మ లు చెప్పారు.


ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన సంస్కరణలు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేపడుతున్నారని చెప్పారు. దీనికి తోడు పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపేట వేస్తున్నట్లు ఎమ్మెల్యేలు వివరించారు. చంద్రబాబు అపార అనుభవం, ముందుచూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ వరం అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు రావాలని ప్రధానమంత్రినిఎమ్మెల్యేలు ఏలూరి ,నరేంద్ర వర్మలు ఆహ్వానించారు. ఈ మేరకు ఆయన మార్చిలో అమరావతి పర్యటనకు వస్తానని ప్రధాన మంత్రి  క్రిస్టోఫర్ లక్సన్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మీ వంతుగా కృషి తోడ్పాటు అవసరమని, పెట్టుబడులతో వచ్చేవారికి చంద్రబాబు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నట్లు వివరించారు.


న్యూజిలాండ్ నుంచి ఏపీకి భారీ పరిశ్రమలను నెలకొల్పేందుకు ప్రధానమంత్రిని ఎమ్మెల్యేలు ఆహ్వానించారు. ఎమ్మెల్యేల పర్యటన మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్, న్యూజిలాండ్ ఎన్నారై టిడిపి ఆహ్వానం మేరకు ఇక్కడ పర్యటనకు వచ్చామని ఎమ్మెల్యేలు వివరించారు. తొలుత ఎమ్మెల్యేలు ప్రధానమంత్రికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేలతో పాటు న్యూజిలాండ్ నేషనల్ పార్టీ ప్రతినిధులు శివ కిలారి, బాల వేణుగోపాల్ వీరం, టిడిపి న్యూజిలాండ్ కోఆర్డినేటర్ జితేందర్ నిమ్మగడ్డ, మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్ నేతలు మద్దుకూరి దిలీప్, అశోక్ గోరంట్ల, న్యూజిలాండ్ ఎన్నారై టిడిపి అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: