రాజకీయాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో బద్ధ శత్రువులు మిత్రులుగా.. మిత్రులు శత్రువులుగా అవుతుంటారు.  ఎవరైనా ఏదైనా మంచి పని చేస్తే దానిని జీవితకాలం గుర్తుపెట్టుకుంటూనే ఉంటాం. అందులోనూ.. అధికారంలో ఉన్న సందర్భంలో చేసిన పనులను కొన్ని ప్రశంసలకు దారితీస్తూనే ఉంటాయి. ఆ రాజకీయ వ్యక్తి ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన జ్ఞాపకాలు మాత్రం విడిచిపోవు.


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చంద్రబాబు మీద ప్రశంసల వర్షం కురిపించారు. అదేంటి చంద్రబాబు అంటే పూర్తిగి గిట్టని కేటీఆర్.. ఆయనపై పొగడ్తల వర్షం కురిపించడం ఏంట అని అనుకుంటున్నారా..! కొన్నికొన్ని చేసిన మంచి పనులు కళ్లెదుటే కనిపిస్తుంటాయి. వాటి విషయంలో ఎవరైనా పొగడక తప్పదు. కేటీఆర్ కూడా సరిగా అదే చేశారు.


గతంలో కేసీఆర్ కూడా తెలుగుదేశం నుంచే బయటకు వచ్చారు. అప్పటి నుంచి కేసీఆర్ చంద్రబాబును విమర్శిస్తూనే ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ సందర్భంలోనూ చంద్రబాబుపై కేసీఆర్, కేటీఆర్ ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో తెలిసిందే. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని పాటించడంతో వారి మధ్య గ్యాప్ మరింత ఎక్కువైంది. ఒకవిధంగా చెప్పాలంటే రాజకీయ శత్రువులుగా మారిపోయారు.


ఈ క్రమంలో చంద్రబాబును కేటీఆర్ మెచ్చుకోవడం నెట్టింటా చర్చకు దారితీసింది. చంద్రబాబు అంటేనే టెక్‌కు పెట్టింది పేరు. హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ పటంలో కనిపించేలా చేసిన నేత. ఈ విషయాన్ని ఆయనే ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నారు కూడా. అయితే.. 25 ఏళ్ల క్రితం చంద్రబాబు 'జీనోమ్ వ్యాలీ'ని స్థాపించారు. భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎల్లా జీనోమ్ వ్యాలీ భావనను ఎన్నో సార్లు పొగిడారు.


చంద్రబాబును జీనోమ్ వ్యాలీ విషయంలో కేటీఆర్ మెచ్చుకున్నారు. జీనోమ్ వ్యాలీని స్థాపించి చంద్రబాబును కొనియాడారు. 25ఏళ్ల క్రితం చంద్రబాబు వేసిన అడుగు ఇప్పుడు ముఖ్యమైన లైఫ్ సైన్సెస్ క్లస్టర్‌గా మారిందని, ప్రపంచంలోని మూడో వంతు వ్యాక్సిన్‌లను ఇక్కడి నుంచే ఉత్పత్తి చేస్తున్నారని పేర్కొన్నారు. కేటీఆర్ చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు వైరల్ కాగా... ఆయన ఆ వీడియోలో చంద్రబాబు కృషిని, విజన్‌ని అభినందిస్తూ మాట్లాడారు. ఆయన్ను ప్రతిష్టాత్మక నాయకుడిగా కొనియాడారు.



మరింత సమాచారం తెలుసుకోండి: