ఇప్పటికే ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మొదలు కాగా నవంబర్ 14వ తేదీ దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. పోర్టల్ లో పేర్లు నమోదు చేసి ఈ ఇంటర్న్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే ఐదేళ్లలో టాప్ 500 కంపెనీలలో కోటి మందికి నైపుణ్యాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం కోసం కేంద్రం 800 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.
లక్షా 25 వేల మందికి నెలకు 5000 రూపాయల చొప్పున సంవత్సరం పాటు ఆర్థిక సహాయం అందిస్తారు. ఇంటర్న్ షిప్ లో చేరిన వాళ్లకు వ్యక్తిగత బీమా సౌకర్యం ఉండటంతో పాటు ఇందుకు సంబంధించిన ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువతీ యువకులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
వార్షికాదాయం 8 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉన్నవారు సీఏ, సీఎం.ఏ అర్హత కలిగిన వారు, ఉన్నత విద్యా సంస్థల్లో గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్లు ఈ స్కీమ్ కు అనర్హులు. 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కు సంబంధించిన సందేహాలు ఉంటే ఆ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ స్కీమ్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు.