గురువారం రోజున కడప నగరపాలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ సురేష్ బాబు తో... గొడవకు దిగారు టిడిపి ఎమ్మెల్యే మాధవి రెడ్డి. కడప నగర పాలకు సమావేశంలో తనకు కూర్చి వేయలేదని... నిల్చోని రచ్చ రచ్చ చేసింది. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా... కార్యాలయానికి వచ్చి రచ్చ చేశారు. ఎమ్మెల్యే కేవలం ఎక్స్ అఫీషియో మెంబర్ అని... ప్రత్యేకంగా ప్రోటోకాల్ ఉండదని మేయర్ చెప్పినా కూడా వినిపించుకోలేదు.
తనకు ప్రోటోకాల్ ఇవ్వాల్సిందేనని గురువారం రోజున పెద్ద గొడవ చేశారు టిడిపి కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి. అయితే ఈ నేపథ్యంలోనే మాధవి రెడ్డి చేసిన ఓ సంఘటన అందరినీ షాక్ నకు గురిచేసింది. కన్నుగీటుతూ గొడవకి ఉసిగొల్పిన టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి...వీడియో వైరల్ గా మారింది. మేయర్ సురేష్ గారితో సమానంగా కుర్చీ కావాలంటూ కావాలనే రచ్చ చేసిన మాధవిరెడ్డి..కావాలనే కన్ను గీటినట్లు వైసీపీ ప్రచారం చేస్తోంది.
గతంలో కడప కార్పొరేషన్‌కు ఓ ఐఏఎస్ అధికారి కమిషనర్‌గా ఉండేవారు. మాధవిరెడ్డి ఎమ్మెల్యే అయ్యాక తమ బంధువునే కార్పొరేషన్ కమిషనర్‌గా గ్రూప్ 1 అధికారి మనోజ్‌రెడ్డిని పట్టు పట్టి మరీ నియామకం చేయించుకుందని వైసీపీ చెబుతోంది. కమిషనర్ వైపు చూస్తూ గొడవ కొనసాగాలంటూ కన్ను గీటిన మాధవిరెడ్డి వీడియోను వైరల్ చేస్తోంది. పక్కా స్కెచ్‌తో రచ్చ చేసిందనడానికి ఈ కన్ను గీటడం కంటే నిదర్శనం ఏం కావాలి ? అని వైసీపీ ప్రశ్నిస్తోంది.