ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనలు ఇతర రాజకీయ నేతల ఆలోచనలకు భిన్నంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఎక్కువమంది ప్రజలకు లబ్ధి చేకూర్చాలని భావిస్తారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు స్ట్రాటజీపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలను బట్టి ఎస్సీ వ‌ర్గీక‌ర‌ణ‌ విషయంలో బాబు నిర్ణయాలు ఉంటాయని బోగట్టా.
 
ఏ జిల్లాలో ఏ సామాజిక వర్గం ఎక్కువగా ఉంటే వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా చంద్రబాబు నిర్ణయాలు ఉండనున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం విషయంలో నెటిజన్ల నుంచి ప్రశంసలు వినిపిస్తుండటం గమనార్హం. చంద్రబాబు నాయుడు ఇతర రాష్ట్రాల సీఎంలకు సైతం ఆదర్శంగా నిలుస్తుండటంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
 
పర్యాటక రంగాన్ని సైతం అభివృద్ధి చేసే దిశగా చంద్రబాబు నాయుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. భవిష్యత్తులో పర్యాటక రంగానిదే హవా అని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని బాబు వెల్లడించారు. ఐటీ అంటే గతంలో ఎగతాళి చేశారని ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా మనవాళ్లే ఉన్నారని చంద్రబాబు తెలిపారు.
 
చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తాను గాడి తప్పిన పాలనను సరి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రజలు గెలిచారని మన రాష్ట్రాన్ని నిలబెట్టారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రానికి ఏపీ ప్రజలు ఆక్సిజన్ ఇచ్చారని ఆయన తెలిపారు. పోగొట్టిన బ్రాండ్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. చంద్రబాబు నాయుడు టెక్నాలజీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటంపై ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చంద్రబాబు నాయుడు కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. చంద్రబాబు తన విజన్ తో రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. బాబు విజన్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.




 


మరింత సమాచారం తెలుసుకోండి: