ఈ మధ్య కాలంలో చాలామంది తమ సంపాదనలో ఎక్కువ మొత్తాన్ని స్థలం, ఫ్లాట్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. స్థిరాస్తి కొనుగోలు చేసే సమయంలో రెరాలో రిజిస్టర్ అయిందో లేదో చెక్ చేయాలి. రిజిష్టర్ కాని ప్రాజెక్ట్ లను కొనుగోలు చేయవద్దని తెలంగాణ రెరా కోరుకుంటూ ఉండటం గమనార్హం. సంస్థలు, బిల్డర్ల చరిత్రను పరిశీలించి కొనుగోలు చేసే స్థలంలో నిర్ణయాలు తీసుకోవాలి.
 
అపార్ట్ మెంట్లు, విల్లాలను పూర్తి చేసే ఆర్థిక సామర్థ్యం సంస్థకు ఉందా లేదా అనేది పరిశీలించాల్సి ఉంటుంది. చెరువులు, ప్రభుత్వ భూముల పక్కన ఉన్న స్థలాలను కొనుగోలు చేసే వాళ్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ధర తక్కువ అని తొందరపడితే భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. సేల్ ఆఫ్ అగ్రిమెంట్ లేకుండా సొమ్ములను చెల్లిస్తే మాత్రం ఇబ్బందులు తప్పవు.
 
చెల్లించిన మొత్తానికి సంబంధించి తగిన రశీదులు పొందాల్సి ఉంటుంది. ఒప్పందం ప్రాతిపదికన ఏవైనా సమస్యలు వస్తే మరో సంస్థను ఆశ్రయించడం ద్వారా న్యాయం పొందవచ్చు. కొనుగోలుదారులు డెవలపర్ల మధ్య ఏదైనా సమస్య తలెత్తితే అవసరం అనుకుంటే కోర్టును ఆశ్రయించే అవకాశం అయితే ఉంటుంది. కొనకముందు ఒకటి చెప్పి కొన్న తర్వాత మరొకటి చెప్పడం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు.
 
ఇలాంటి ఇబ్బందులు ఎదురైన సమయంలో స్థిరాస్తి రంగ నిపుణులను సంప్రదిస్తే మంచిదని చెప్పవచ్చు. చాలామంది బిల్డర్ల చేతిలో మోసపోతున్న సందర్భాలు సైతం ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో మోసాలు మాత్రం ఊహించని స్థాయిలో పెరిగిపోతున్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్య కాలంలో మోసాలు చేయడమే లక్ష్యంగా కొంతమంది మోసాలకు పాల్పడుతుండటం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. ఈ విధంగా మోసపోతున్న వాళ్లు వేల సంఖ్యలో ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. స్థలం, ఫ్లాట్ కొనేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.






 


మరింత సమాచారం తెలుసుకోండి: