వైసీపీ ప్రభుత్వంలో నాలుగు నెలల పాటు నరసాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు..RRR గా పిలుస్తూ ఉంటారు. ఆయన ఆ విధంగా ఏపీలో ఒక వెలుగు వెలిగారు. అయితే 2024 ఎన్నికల ముందు టిడిపి పార్టీలోకి చేరి ఎంపీగా నరసాపురం నుంచి గెలవాలనుకున్నప్పటికీ కానీ ఎంపీ సీటు పొత్తులో భాగంగా రాకపోవడంతో ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా టిడిపి నుంచి పోటీ చేసి గెలిచారు. అలాగే మంత్రివర్గంలో చంద్రబాబు సమక్షంలో పనిచేయాలని ఆరాటపడిన కానీ అది దక్కలేదట. ఆ సమయంలో స్పీకర్ గా కూడా ఆయనకు అవకాశం ఇవ్వాలని భావించినప్పటికీ ఆ పదవి కూడా దక్కలేదు.


మొత్తానికి రఘురామ కృష్ణంరాజు కేవలం ఒక ఎమ్మెల్యేగా మాత్రమే మిగిలిపోయారు. అయితే ఇదంతా ఇలా ఉన్నప్పటికీ జమీలి ఎన్నికలు తెరమీదకి ఇప్పుడు మరొకసారి ఎక్కువగా వినిపిస్తోంది.. అయితే ఇవి జరిగితే ఎవరికీ లాభం అనే చర్చ కూడా ఇప్పుడు మొదలైంది. ఈ సమయంలోనే rrr ఒక యూట్యూబ్ ఛానల్ కు తో మాట్లాడుతూ జమిలి ఎన్నికల మీద పలు విషయాలను తెలిపారు. దేశంలో జమిలి ఎన్నికలు కచ్చితంగా వస్తాయని బిజెపిలో తనకు ఉన్న మిత్రుల ద్వారా ఈ విషయం తెలిసిందని తెలిపారు. జెమిలి ఎన్నికల విషయంలో బిజెపి చాలా పట్టుదలతో ఉందని కూడా వెల్లడించారు.


వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న నినాదమే బిజెపి అన్నట్లుగా తెలిపారు రఘురామకృష్ణంరాజు. ఇలా జమిలి ఎన్నికలు పెడితే పూర్తి మెజారిటీ ఇండియా కూటమి పెద్దలకి నమ్మకం  ఉన్నదని అందుకే ఇలా చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కూడా జమిలి ఎన్నికలకు ఏదైనా అభ్యంతరం పెట్టె అవకాశం కూడా కనిపించడం లేదని తెలిపారు. జమిలి ఎన్నికల విషయంలో టిడిపి బిజెపి ఆలోచనలను బలపరుస్తాయేమో అన్నట్లుగా తెలిపారు. 2027 మొదట్లో ఫిబ్రవరిలో జమిలి ఎన్నికలు జరగవచ్చు అని తన అభిప్రాయంగా తెలిపారు RRR. 2026 లో కొత్తగా లోక్సభ సీట్లను కూడా పెంచడం అలాగే పునర్విభజన కూడా జరుగుతాయని అంటున్నారని దీంతో ఆంధ్ర ప్రదేశ్లో 175 అసెంబ్లీ సీట్లు కాస్త 225 కు వస్తాయని అంచనా వేస్తున్నారని తేలిపారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో జమిలి ఎన్నికలు రాయడం ఖాయమని టిడిపి ఎమ్మెల్యే తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: