రాజకీయ లబ్ది కోసం మాత్రమే ఆలోచించే రాజకీయ నాయకులు ఉన్నంత కాలం రాష్ట్రంలోని నిరుద్యోగులు.. నిరుద్యోగులుగానే మిగిలిపోతారు..గత ప్రభుత్వం చేసిన దారుణమైన మోసం మరువక ముందే కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం సైతం అలాంటి అడుగులే వేస్తుంటే డీఎస్సి అభ్యర్థులు వారి మనోవేదన ఎవరికీ చెప్పుకోవాలో తెలీక కుమిలిపోతున్నారు.. చేస్తున్న ప్రైవేట్ ఉద్యోగాలు సైతం మానేసి ఉపాధ్యాయ ఉద్యోగం కోసమే అప్పు చేసి మరీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎందరో వున్నారు.. వాళ్ళ బాధ చెప్పుకోలేనిది..ఏకంగా 16,347 పోస్టులకు డీఎస్సి ఇస్తున్నాం అని మొదటి సంతకం చేసిన కూటమి ప్రభుత్వం..అమలులో మాత్రం చిత్తశుద్ధి చూపించడం లేదు..కొత్తగా వచ్చిన అభ్యర్థుల కోసం టెట్ నిర్వహించారు కానీ అసలు నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి ఎక్కడా లేని కుంటి సాకులు తెరపైకి తెస్తున్నారు.
ఎట్టి పరిస్థితులలో డిసెంబర్ నాటికీ పరీక్షలు జరుపుతామని ఊదరగొట్టిన కూటమి ప్రభుత్వం తీరా నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి ఎస్సి వర్గీకరణ అంటూ మరో నాటకానికి తెరలేపింది.. దీనితో అభ్యర్థులు మళ్ళీ మోసపోయామని తల బాదుకుంటున్నారు…ఈ డీఎస్సి పరిస్థితి ఇంతేనా ఇంత కంటే ముందుకు కదలదా అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.. మా గోడు పట్టించుకోండి అంటూ వినతి పత్రాలను సంబంధిత నాయకులకు అందజేస్తూనే వున్నారు.. దయచేసి మా బాధ అర్ధం చేసుకోండి.. మాకు నోటిఫికేషన్ ఇవ్వండి అంటూ అభ్యర్థులు ప్రాధేయ పడుతున్నారు..మరి అభ్యర్థుల గోడు ప్రభుత్వం పట్టించుకుంటుందా..?వయోపరిమితి ముగుస్తున్న అభ్యర్థులకు న్యాయం జరుగుతుందా..?అనేది ప్రభుత్వం నిర్ణయం పై ఆధారపడి వుంది.. ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూడడమే తప్ప చేసేది ఏమి లేదు..