దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్ లను నవీకరించింది అన్న విషయం తెలిసిందే. ఏకంగా కోట్లాది రూపాయల నిధులు కేటాయించి అధునాతన సదుపాయాలతో సరికొత్త రైల్వే స్టేషన్లను నిర్మించింది. ఇక ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అంతేకాదు సరికొత్త రీతిలో ఇక అతివేగమంతమైన ప్రయాణాలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇలా ఎన్నో ఏళ్ల నుంచి రైల్వే శాఖలో చాలానే మార్పులు వస్తూ ఉన్నాయి. కానీ ఒక్క విషయంలో మాత్రం రైల్వే శాఖ ఇప్పటికీ మార్పులు చేయలేకపోయింది. ఇతర దేశాల్లో అధనాతన టెక్నాలజీ వాడుతుంటే ఇప్పటికీ ఏకంగా రైల్వే కార్మికుల ప్రాణాలతో ఇండియన్ రైల్వే చెలగాటమాడుతుంది.
ఇటీవల బీహార్ లో ఒక రైల్వే కార్మికుడు రెండు బోగీల మధ్య కప్లింగ్ విడదీస్తూ చివరికి ప్రాణాలు వదిలిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం కాస్త ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోయింది. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే వ్యవస్థ ఉన్న ఇండియాలో భోగిల మధ్య కప్లింగ్ విషయంలో ఎందుకు టెక్నాలజీ వాడటం లేదు అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పలు దేశాల్లో ఆటోమేటిక్ కప్లింగ్ సిస్టం ఉందని.. దాన్ని ఎందుకు ఇండియన్ రైల్వేలో ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటూ ఇక భారత రైల్వే శాఖను నిలదీస్తున్నారు అందరూ. అన్నీ చేసి ఇదొక్కటి ఎందుకు మరిచారు అంటూ ప్రశ్నిస్తున్నారు. భారత రైల్వేలో ఇలాంటి టెక్నాలజీ తీసుకురావడం వల్ల ప్రమాదాలు తగ్గుతాయి అంటూ సూచిస్తున్నారు.