ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బడ్జెట్ ను శాసనసభలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. అయితే సూపర్ సిక్స్ హామీల గురించి ప్రస్తావన, బడ్జెట్ లో కేటాయింపులు లేకపోవడం ఒకింత నిరాశ కలిగించిందనే చెప్పాలి. ఈ ఏడాది 91,443 కోట్లు అప్పులు చేయాలని నిర్ణయించింది. అయితే సూపర్ సిక్స్ కు సంబంధించిన ప్రత్యేక పద్దులను ఈ బడ్జెట్ లో కేటాయింపులు జరపలేదు. ఇది రాజకీయంగా చర్చకు దారితీసింది. గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన ఎన్నికల హామీల అమలుపై పయ్యావుల కేశవ్ ఎలాంటి ప్రకటన చేయలేదు.అయితే నాలుగు నెలల బడ్జెట్ మాత్రమే కావడంతో బహ‍ుశ ఈ బడ్జెట్ లో సూపర్ సిక్స్ కు సంబంధించిన హామీలకు నిధుల కేటాయింపు జరపలేదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదిలావుండగా సూపర్ సిక్స్ హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ ఆర్దిక సంవత్సరంలోనే ప్రారంభించేలా పయ్యావుల తన ప్రసంగంలో సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో ఇతర పథకాల ప్రస్తావన చేయలేదు. రైతులకు ఇచ్చిన హామీల గురించి వివరించారు.అయితే, మహిళలకు ప్రతీ నెల రూ 1500 ఇస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు హామీ ఇచ్చారు.

ఇప్పుడు ఈ పథకం అమలు వచ్చే ఆర్దిక సంవత్సరంలోనే అమలు చేసే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుత బడ్జెట్ లో ఈ పథకం గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేయలేదు. రాష్ట్ర ఆర్దిక పరిస్థితి గురించే ఎక్కువగా వివరించారు. మహిళలకు అమలు చేస్తున్న దీపం పథకం గురించి కేశవ్ గుర్తు చేసారు. అదే విధంగా అమ్మకు వందనం పథకం సైతం వచ్చే ఆర్దిక సంవత్సరంలోనే అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ పథకం కోసం నిధుల ప్రస్తావన కేశవ్ తన ప్రసంగంలో చేయకపోవటంతో రానున్న నాలుగు నెలల కాలంలో ఈ పథకం అమలయ్యే అవకాశం లేదనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.ఈ నేపథ్యంలో దీని గురించి ప్రత్యేకంగా పయ్యావుల కేశవ్ బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం కూడా పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. మరి త్వరలో ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది. ఇక ప్రజలు కూడా కూటమి సర్కార్ ప్రవేశపెట్టే బడ్జెట్ లో సూపర్ సిక్స్ కు సంబంధించిన హామీల ప్రస్తావన లేకపోవడం ఒకింత ఉసూరు కనిపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: