ఆంధ్రప్రదేశ్ ఏపీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజున మొదలయ్యాయి.ఇందులో సూపర్ సిక్స్ హామీలకు పెద్దపీట వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే వ్యవసాయ శాఖకు సంబంధించిన బడ్జెట్ ని మంత్రి అచ్చెమనాయుడు ప్రవేశపెట్టడం జరిగింది.. ఇందు కోసం 43,402 కోట్ల రూపాయలను బడ్జెట్ ప్రవేశపెట్టారు అచ్చెమనాయుడు. అలాగే ప్రభుత్వము కూడా భూసార పరీక్షలకు, వడ్డీ లేని రుణాలను సైతం అందించేందుకు కూడా వ్యవసాయ శాఖ మంత్రి ప్రాధాన్యత ఇస్తామంటూ తెలిపారు. అలాగే రైతులకు సైతం అన్ని విధాలుగా ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ముందు ఉంటుంది అంటూ వెల్లడించారు.


రైతులకు సైతం సంక్షేమ పథకానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని అందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ అచ్చెమనాయుడు తెలియజేశారు. రైతులు పండించే పంటలకు సైతం గిట్టుబాటు ధరలు కూడా కల్పిస్తామంటూ వెల్లడించారు.. అలాగే తుఫానులు వరదల వల్ల నష్టపోయిన రైతులకు సైతం తమ ప్రభుత్వం కూడా అండగానే ఉంటుంది అంటూ అచ్చెమనాయుడు భరోసా ఇవ్వడం జరిగింది. రైతుల కోసం విత్తనాల రాయితీ కోసం 240 కోట్లు  కేటాయించామని అలాగే భూసార పరీక్షల కోసం 38.88 కోట్ల కేటాయించామని తెలిపారు.


అన్నదాత సుఖీభవకు రూ 4500 కోట్ల రూపాయలను కేటాయించినట్లు అచ్చెమనాయుడు తెలియజేశారు. రైతు సేవ కేంద్రాలకు కోసం అలాగే ఇతరత్రా  వాటికోసం కొన్ని కోట్ల రూపాయలను కూడా కేటాయించామని తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెమనాయుడు. ప్రతి ఏడాది కూడా రూ .20వేల రూపాయలు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇందులో పిఎం కిసాన్ కింద రూ .6000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే మిగిలిన డబ్బులను కూటమి ప్రభుత్వం ఇస్తుంది అని తెలియజేశారు. అన్నదాత సుఖీభవకి త్వరలోనే మార్గదర్శకాలు పైన కూడా ఆదేశాలను జారీ చేస్తామంటూ తెలిపారు. మరి  ఎప్పుడు రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తారని విషయంపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: