ఏపీ బడ్జెట్ ఎప్పుడెప్పుడు ప్రవేశపెడతారని ఎదురుచూసిన వాళ్లకు ఏపీ సర్కార్ భారీ షాకిచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఏపీ సర్కార్ బడ్జెట్ లో ఉచిత బస్సుకు సంబంధించి ఎలాంటి ప్రకటన లేకపోవడం గమనార్హం. అటు వార్షిక బడ్జెట్ లో, ఇటు వ్యవసాయ బడ్జెట్ లో అన్నీ కోతలే కావడం హాట్ టాపిక్ అవుతోంది. గత సర్కార్ పాలనలో అన్ని రంగాలకు సమ ప్రాధాన్యత దక్కగా చంద్రబాబు మాత్రం సమ న్యాయం చేయలేకపోయారు.
 
కొన్ని రంగాలకు సగం కంటే తక్కువగా కేటాయింపులు జరపడం హాట్ టాపిక్ అవుతోంది. తల్లికి వందనం స్కీమ్ కు కేవలం 2491 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ స్కీమ్ అమలు కోసం ఏకంగా 10 వేల కోట్ల రూపాయలకు పైగా అవసరం కాగా కేవలం పావు వంతు నిధులు మాత్రమే కేటాయించడం హాట్ టాపిక్ అవుతోంది. ఇంటర్ విద్యార్థులకు ఈ స్కీమ్ అమలు లేనట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
సూపర్ సిక్స్ కాదు సూపర్ మోసం అంటూ నెటిజన్లు ఏపీ బడ్జెట్ పై కామెంట్లు చేస్తున్నారు. కోతల బడ్జెట్ ప్రవేశపెట్టిన బాబు సర్కార్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. బడ్జెట్ లో ఏపీ సర్కార్ మహాశక్తి పథకం గురించి వెల్లడించలేదు. 19 నుంచి 59 ఏళ్ల లోపు మహిళలకు 1500 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇవ్వగా ఈ హామీ అమలుకు వేల కోట్ల రూపాయలు కావాలి.
 
అయితే ప్రభుత్వం వైపు నుంచి ఈ స్కీమ్ కు సంబంధించి సరైన రెస్పాన్స్ లేకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. అన్నదాత సుఖీభవకు ఏపీ సర్కార్ 4500 కోట్ల రూపాయలు కేటాయించగా సంక్రాంతి పండుగ సమయంలో ఈ మొత్తాన్ని రైతుల ఖాతాలలో జమ చేయనున్నారని తెలుస్తోంది. కేంద్రం ఇచ్చే 6000 రూపాయలతో ఏపీ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. లబ్ధిదారులకు సంబంధించి భారీగా కోత ఉండబోతుందని తెలుస్తోంది.
 


మరింత సమాచారం తెలుసుకోండి: