- ఐదేళ్లలో అభివృద్ధి పథంలో ఏపీ
- టీడీపీ అధికార ప్రతినిధి దాసరి శేషు
- ( గోదావరి - ఇండియా హెరాల్డ్ ) . .
తాజాగా ఈ రోజు ఏపీ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షకు రాష్ట్ర అభివృద్ధికి అద్దం పట్టేలా ఉందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు అన్నారు. బడ్జెట్ పై స్పందిస్తూ జంగారెడ్డిగూడెంలో బడ్జెట్‌పై తన అభిప్రాయం స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రవేశపెట్టిన మొట్టమొదటి వార్షిక బడ్జెట్లో కేటాయింపులు ప్రాధాన్యాలుగా చూస్తే విద్య వైద్య వ్యవసాయ రంగాలకు మంచి కేటాయింపులు చేశారని, ఆరోగ్య రంగానికి 19 వేల కోట్లు వ్యవసాయ రంగానికి 43,500 కోట్ల కేటాయింపు చేయడం హర్షనీయమని అన్నారు. అలాగే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి కోసం 17 వేల కోట్లు కేటాయించడం గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఈ సందర్భంగా అర్థమవుతుందని అన్నారు.
రోడ్లు, భవనాలకు సంబంధించి దాదాపు పదివేల కోట్లు కేటాయించడం సంతోషించదగ్గ విషయమని శేషు అన్నారు. బీసీ, ఎస్సీ మరియు ఎస్టీ సంక్షేమానికి దాదాపు రు . 55 వేల కోట్లు కేటాయించడం ఈ వర్గాల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఉన్న చిత్తశుద్ధిని, ప్రేమను తెలియజేస్తుందని శేషు తెలిపారు. మొత్తంగా చూస్తే బడ్జెట్ కేటాయింపులు అటు ప్రాజెక్టులకు, పరిశ్రమలకు, క్రీడలకు, నైపుణ్యాభివృద్ధికి చేయూతనిచ్చే విధంగా ఉందని, మరోవైపు వ్యవసాయానికి వైద్య రంగానికి విద్య రంగానికి ప్రాధాన్యత ఇచ్చారని, రాబోయే ఐదు సంవత్సరాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకు వెళ్ళేందుకు ఈ బడ్జెట్ దోహదం చేస్తుందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు అన్నారు.