- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . .

వైసీపీ అధినేత జగన్.. గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2009లో జగన్ తండ్రి వైయస్సార్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే మరణించారు. అప్పటికి మూడు నెలలు ఎంపీగా ఉన్న జగన్.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి వైసీపీ పెట్టుకున్నారు. అయితే తాజాగా ఏపీ హోమ్ మంత్రి వంగలపూడి అనిత.. జగన్ కు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని సవాల్ చేశారు. దీంతో జగన్ డేరింగ్‌కు.. అంత పరీక్ష పెడుతున్నారా.. అన్న చర్చ వస్తోంది.


జగన్ అసెంబ్లీకి రావాలంటే ధైర్యం అవసరమా అంటే.. ఆయన పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఆయన కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే సభలో అడుగు పెట్టాలి. స్పీకర్ అనుమతితోనే ఆయనకు మైకు వస్తుంది .. ఎందుకంటే ? వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇప్పుడు చూస్తే కూటమికి ఏకంగా 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో 11మంది చిన్న నెంబర్తో జగన్ అసెంబ్లీలో కి వచ్చి పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు లాంటి నేతలను ఎదిరించి అసెంబ్లీలో ఎలా ? తట్టుకుంటారు అన్నది కూడా సహజంగానే చర్చకి వస్తుంది.


వాస్తవంగా చూడాలంటే జగన్‌కు ధైర్యం ఉంటే అనే మాట తప్పని చెప్పాలి. జగన్ కాంగ్రెస్ పార్టీని.. అప్పుడు బలమైన మహిళ నేతగా ఉన్న సోనియాగాంధీని ఎదిరించి బయటికి వచ్చి వైసీపీ పార్టీ పెట్టుకున్నారు. చివరకు అదే కాంగ్రెస్‌ను ఆంధ్రప్రదేశ్‌లో భూస్థాపితం చేసి ముఖ్యమంత్రి అయ్యారు. అలాంటి గట్స్ ఉన్న జగన్‌కు ధైర్యం అనే మాట కామెడీగా ఉందన్న చర్చలు వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. జ‌గ‌న్ కు ప‌డ‌డం పైకి లేచి నిల‌బ‌డ‌డం అల‌వాటే.. 2014 లో ఓట‌మి నుంచి పుంజుకుని 2019 లో ఏకంగా 151 సీట్ల‌తో అధికారంలోకి వ‌చ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: