కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్ ఈ విషయాలను వెల్లడించారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి ఎంపీ పీఏ బండి రాఘవరెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా పోస్టులు పెట్టానని చెప్పినట్టు తెలుస్తోంది. రాజకీయ ప్రత్యర్థుల మీద పోస్టులు పెట్టడం గురించి అవినాష్ రెడ్డి చెబితే రాఘవ రెడ్డి డైరీలో రాసుకోవడం తాను చూశానని వర్రా రవీందర్ రెడ్డి చెప్పినట్టు సమాచారం అందుతోంది.
ఎంపీ ఇచ్చే కంటెంట్ ను రాఘవరెడ్డి తనకు సూచించిన నేపథ్యంలో జగన్ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, మాజీ మంత్రి వివేకా కూతురు షర్మిలపై పోస్టులు పెట్టానని వర్రా రవీందర్ రెడ్డి చెప్పారని భోగట్టా. డీఐజీ ప్రవీణ్ మాట్లాడుతూ నిందితులు వాడిన భాష చాలా దారుణంగా, అసభ్యంగా ఉందని చెప్పినట్టు తెలుస్తోంది. సునీత, షర్మిల ఇచ్చిన ఫిర్యాదులను ఇక్కడికి బదిలీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
నిందితులు పెట్టిన పోస్టులను చదవడానికి మేము కూడా ఇబ్బందులు పడుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. రవీందర్ రెడ్డి గతంలో భారతి సిమెంట్ పరిశ్రమలో పని చేసి 2019లో సోషల్ మీడియా కన్వీనర్ గా చేరారని తెలుస్తోంది. జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్ లో నాలుగైదు రోజుల కింద కేసు నమోదు అయిందని తెలుస్తోంది. ఈ వివాదంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి. ప్రస్తుతం పోలీసులు ఎంపీ పీఏ రాఘవరెడ్డి కోసం గాలిస్తున్నామని చెప్పారని సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో ఈ వివాదానికి సంబంధించి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.